సిడ్నీ మైదానంలో దిగ్గజాలు భారత్, ఆస్ట్రేలియా మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. ఆసీస్ 374 పరుగులు చేయడంతో 375 లక్ష్యంతో భారత్ బ్యాటింగ్ బరిలోకి దిగింది. శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాలు ఓపెనర్లుగా దిగారు. హాజిల్ వుడ్ లో వేసిన రెండో ఓవర్ వరకే మయాంక్ అగర్వాల్ 14 పరుగులు చేశాడు. దీంతో రెండో ఓవర్లకే భారత్ స్కోరు 32కు చేరింది. అయితే అదే హాజిల్ వుడ్ వేసిన నాలుగో ఓవర్ లో శిఖర్ దావన్ సింగిల్ తీయగా, మయాంక్ అగర్వాల్ సిక్స్ కొట్టాడు. అయితే ఆరో ఓవర్ లో మయాంక్ అగర్వల్ 22 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు. దీంతో భారత్ 53 పరుగుల వద్దే ఫస్ట్ వికెట్ కోల్పోయింది.