చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా వచ్చే ఏడాది కూడా ధోని కొనసాగుతాడని ఈ జట్టు సీఈవో విశ్వనాథన్ తెలిపాడు. ఐపీఎల్-21 లోనూ చెన్నై కెప్టెన్ ధోని అని చెప్పడంతో ధోని ఫ్యాన్స్ సంబరాల్లో మునిగారు. అయితే ఈసారి రైనా, హర్బజన్ కరోనా కేసులతో వెనుదిరగడం బాధాకరమన్నారు. 3 సార్లు ఛాంపియన్‌గా,5 సార్లు రన్నరప్‌గా నిలిచిన సీఎస్‌కే ఈసారి లీగ్ దశలోనే ఇంటి బాట పట్టింది. అయితే వచ్చేసారి ధోని కెప్టెన్ ఉండడని వస్తున్న వార్తలపై సీఈవో ప్రకటన చేయడంతో ధోని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.