అప్పుడే 6 కోట్ల ఓట్లు.. అమెరికా ఓటర్ల తీర్పు ఎటువైపు?

అసలే కరోనాతో కకావికలమైన దేశం. అందులోనూ అగ్రరాజ్యం. ఇప్పుడు ఆ అగ్రరాజ్యానికి ఎన్నికలు వచ్చాయి. అయితే.. ఇప్పుడిప్పుడే ఆ దేశం కరోనా నుంచి కోలుకుంటోంది. ఒక విధంగా కరోనా భయం కూడా పోయింది. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో తమ ఓటింగ్‌ సత్తా చాటేందుకు ప్రజలు సిద్ధమయ్యారట. ఇందుకు నిన్న జరిగిన ప్రీ పోలింగే కారణం. కరోనా కారణంగా ఓటింగ్‌ శాతం తగ్గుతుందని అందరూ భావించినా.. ప్రజలు మాత్రం ఓటు వేసేందుకు ఆసక్తి చూపారట. Also Read: జేడీయూ, […]

Written By: NARESH, Updated On : October 27, 2020 4:35 pm
Follow us on

అసలే కరోనాతో కకావికలమైన దేశం. అందులోనూ అగ్రరాజ్యం. ఇప్పుడు ఆ అగ్రరాజ్యానికి ఎన్నికలు వచ్చాయి. అయితే.. ఇప్పుడిప్పుడే ఆ దేశం కరోనా నుంచి కోలుకుంటోంది. ఒక విధంగా కరోనా భయం కూడా పోయింది. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో తమ ఓటింగ్‌ సత్తా చాటేందుకు ప్రజలు సిద్ధమయ్యారట. ఇందుకు నిన్న జరిగిన ప్రీ పోలింగే కారణం. కరోనా కారణంగా ఓటింగ్‌ శాతం తగ్గుతుందని అందరూ భావించినా.. ప్రజలు మాత్రం ఓటు వేసేందుకు ఆసక్తి చూపారట.

Also Read: జేడీయూ, బీజేపీల మధ్య పోస్టర్‌ వివాదం..! మిత్రబంధం చెడిందా..?

పోలింగ్‌కు మరో తొమ్మిది రోజులే ఉంది. దీంతో ఎర్లీ బ్యాలెట్‌ ఓటింగ్‌ విధానంలో ఆరు కోట్ల ఓట్లు పోలయ్యాయి. మునుపటితో పోల్చితే ముందస్తు ఓటింగ్‌ రేటులో ఇదే ఎక్కువ. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఎన్నికల అధికారులు నిర్వహించిన సర్వేలో ఇది వెల్లడైంది. నివేదిక ప్రకారం, 2016 లో ఎన్నికలకు ముందు ఓటింగ్‌లో వేసిన ఓట్ల కంటే ఈసారి ఎక్కువ ఓట్లు వస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అమెరికా దేశంలో 257 మిలియన్లకు పైగా జనాభా 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఉండగా.. వీరిలో సుమారు 24 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఈ ఏడాది ఎన్నికలలో ముఖ్యమైన పాత్ర పోషించబోయే 16 రాష్ట్రాల్లోనే 45 మిలియన్ ఓట్లు ఉన్నాయి. అంటే మొత్తం ఓట్లలో 54 శాతం ఓట్లు ఇక్కడే ఉన్నాయి.

ఈసారి ఓటు వేయడానికి ముందు 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మునుపటి ఎన్నికల కంటే ఈసారి వారి సంఖ్య ఎక్కువ. ఫ్లోరిడా, కరోలినాలో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కంటే డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ ముందున్నారని ఎన్నికల ముందస్తు సర్వేలు చెబుతున్నాయి. ట్రంప్ 2016 లో ఫ్లోరిడాలో ఒక శాతం కన్నా తక్కువ ఓట్ల తేడాతో గెలిచారు. ట్రంప్‌కు 49.02 శాతం ఓట్లు రాగా, ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌కు 47.82 శాతం ఓట్లు వచ్చాయి. అయితే.. ఈసారి సర్వే ప్రకారం ఫ్లోరిడా ఓటర్లలో 37 శాతం మంది ఎన్నికలకు ముందు ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరిలో 71 శాతం మంది ఓటర్లు జో బిడెన్‌కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ట్రంప్‌తో 27 శాతం మందే ఉన్నారు.

Also Read: అంబానీ vs అమెజాన్ అధినేత.. 1.92 లక్షల కోట్లు ఆవిరి

దక్షిణ కెరొలినలో రిపబ్లికన్ల కంటే డెమొక్రాట్లు కొంచెం ముందున్నారు. కానీ.. పోటీ మాత్రం గట్టిగానే ఉంది. అయితే, ఎర్లీ బ్యాలెట్టు లెక్కించేందుకు సమయం పడుతుందని, అందువల్ల ఎన్నికల తర్వాతే ఫలితాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 2016లో సైతం ఈ ఆలస్యం జరిగిందని, ఈ దఫా జాప్యం మరింత ఎక్కువ కావచ్చునని చెబుతున్నారు. ప్రధాన ఎన్నికలు పూర్తయిన తర్వాతనే ఎర్లీ బ్యాలెట్లను లెక్కించే పని మొదలెడతారు. ఇవన్నీ పూర్తి కావడానికి మరో ఒకటి రెండు రోజులు పట్టవచ్చని నివేదిక తెలిపింది. ప్రస్తుతం పోలైన 5.87 కోట్ల ఓట్లలో 54 శాతం ఓట్లు కీలకమైన 16 రాష్ట్రాల నుంచి వచ్చాయి. హోరాహోరీగా సాగుతున్న ఈ పోరులో చివరికి ఎవరిది పైచేయి అవుతుందో రిజల్ట్స్‌ వచ్చే వరకూ ఆగాల్సిందేనేమో.