https://oktelugu.com/

 ‘ఆర్ఆర్ఆర్’ రచ్చ..రాజమౌళికి వార్నింగ్.. రంగంలోకి బీజేపీ ఎంపీ.!

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్లో ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం) మూవీని నిర్మిస్తున్నాడు. భారీ తారాగణంతో వస్తున్న ఈ మూవీకి కీరవాణి అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Also Read: అవసరాల-నాని కాంబో సెట్టయినట్టేనా? ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇప్పటికే రెండు టీజర్లు విడుదలయ్యాయి. ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్లో చరణ్ యాక్షన్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 27, 2020 / 01:37 PM IST
    Follow us on

    దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్లో ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం) మూవీని నిర్మిస్తున్నాడు. భారీ తారాగణంతో వస్తున్న ఈ మూవీకి కీరవాణి అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

    Also Read: అవసరాల-నాని కాంబో సెట్టయినట్టేనా?

    ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇప్పటికే రెండు టీజర్లు విడుదలయ్యాయి. ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్లో చరణ్ యాక్షన్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించాడు. ఈ టీజర్ యూట్యూబ్లో సన్షేషన్ క్రియేట్ చేసింది. అదేవిధంగా దసరా కానుకగా ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ రిలీజైంది. ఈ టీజర్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ తో ట్రెండింగులోకి దూసుకెళ్లింది.

    ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ గుస్ బంప్స్ వచ్చేలా దర్శకుడు రాజమౌళి తీర్చిదిద్దాడు. ఈ టీజర్ పై అనేక విమర్శలు.. వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ టీజర్లోని కొన్ని సన్నివేశాలను రాజమౌళి కాపీ చేశాడనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఆదివాసీల మనోభావాలను దెబ్బతీసేలా టీజర్ ఉందనే విమర్శలు పెద్దఎత్తున వచ్చాయి.

    ఈనేపథ్యంలో ఆదివాసులు ఇప్పటికే రంగంలోకి దిగారు. కొమురంభీంను ముస్లిం పాత్రలో చూపించడాన్ని వారంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఆదివాసీ ఎంపీ సోయం బాపురావు రాజమౌళికి వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కొమరం భీమ్ జల్.. జంగల్.. జమీన్ నినాదంతో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారని బాపురావు తెలిపారు. చరిత్రను వక్రీకరించి భీమ్ కు ముస్లింల టోపీ పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

    Also Read: పవన్ ను వెంటాడుతున్న‘అజ్ఞాతవాసి’.. ఇప్పుడెలా?

    ‘ఆర్ఆర్ఆర్’లో భీమ్ పాత్రకు పెట్టిన టోపీ తొలగించాలని సోయం బాపురావు డిమాండ్ చేసారు. సినిమాను ఇలాగే రిలీజ్ చేస్తే మాత్రం థియేటర్లను తగుల బెట్టే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. సినిమా కలెక్షన్ల కోసం తమబ ఆరాధ్య దైవాన్ని కించ పరిస్తే సహించేది లేదన్నారు. టీజర్ నుంచి ఆ షాట్ ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై రాజమౌళి ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే..!