https://oktelugu.com/

Gurupurnima : గురుపూర్ణిమ రోజు ఇలా చేస్తే వ్యాపారవృద్ధి జరుగుతుంది

గురు పౌర్ణమి రోజు గురువులను పూజిస్తే బలం పెరుగుతుంది. ఈ రోజు గురువును ఇంట్లోకి ఆహ్వానించి భోజనం పెట్టడం వల్ల ఆశీస్సులు అందుతాయి. గురువుకు ఆతిథ్యం ఇచ్చి దక్షిణ ఇవ్వడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. గురుపౌర్ణమి రోజు విష్ణుమూర్తిని కొలిచి విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. బ్రహ్మ, ఇంద్ర యోగాల వల్ల గురు పూర్ణిమ యోగం కలిగి శుభాలు వస్తాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : July 1, 2023 / 06:36 PM IST
    Follow us on

    Gurupurnima : ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజు గురుపూర్ణిమ జరుపుకోడం సహజమే. ఈ సంవత్సరం జులై 3న గురుపూర్ణిమ వస్తోంది. గురుపూర్ణిమ రోజు ఏం చేయాలి? ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకుని చేయడం వల్ల పురోగతి లభిస్తుంది. గురుపూర్ణిమ రోజు ఏం చేస్తే మనకు మంచి జరుగుతుందనే వాటిని తెలుసుకుని పాటించాలి. ఈ సారి గురుపూర్ణిమ రోజు బ్రహ్మ మరియు ఇంద్ర యోగాలు దక్కనున్నాయి.

    వ్యాపార వృద్ధికి..

    చాలా మంది వ్యాపారంలో లాభాలు రావడం లేదని కలత చెందుతూ ఉంటారు. ఎంత కష్టపడి పనిచేసినా డబ్బులు రావడం లేదని చెబుతుంటారు. అలాంటి వారు గురుపూర్ణిమ రోజు ఇంట్లో గురు యంత్రాన్ని ప్రతిష్టించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. దీంతో జాతకంలో బృహస్పతి బలంగా మారి మనకు పురోగతి కలిగేలా చేస్తాడు. దీంతో వ్యాపార వృద్ధి జరుగుతుంది. లాభాల పంట పండుతుది.

    దానం చేయడం

    గురుపౌర్ణమి రోజు పసుపు రంగు దుస్తులు, పసుపు రంగు పండ్లు, స్వీట్లు, కుంకుమ పువ్వు, నెయ్యి, ఇత్తడి సామాన్లు దానం చేయడం వల్ల వ్యాపారంలో వృద్ధి జరుగుతుంది. ఈశాన్య దిక్కు గురు గ్రహానికి సంబంధించి కావడంతో గురు పౌర్ణమి రోజు ఈశాన్య దిక్కులో శుభ్రం చేసి దీపాన్ని వెలిగిస్తే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారుతుంది.

    గురువులను పూజిస్తే..