https://oktelugu.com/

Chanakya Niti : చాణక్య నీతి: ఏ విషయాలు ఇతరులతో పంచుకోకూడదో తెలుసా?

మన లక్ష్యం ఎవరితోనూ పంచుకోకూడదు. మనం చేసే పనులు ఇతరులకు తెలియకుండా ఉండటమే శ్రేయస్కరం. అప్పుడే మనకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : July 1, 2023 / 06:41 PM IST
    Follow us on

    Chanakya Niti : అన్ని విషయాలు అందరితో పంచుకోం. కొన్ని విషయాలు కొందరితో మాత్రమే పంచుకోవాలి. మన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని రహస్యాలు కూడా ఉంచుకోవాలి. అన్ని విషయాలు బయట పెడితే మనమేమిటో తెలిసిపోతుంది. అలా తెలిసిన తరువాత మనల్ని లెక్క చేయరు. అందుకే మన గురించి తెలిసీతెలియనట్లుగా ఉంటేనే మనకు విలువ ఉంటుంది. అంతేకాని పుస్తకం తెరిచినట్లుగా ఉంటే మనకు వ్యక్తిగత జీవితమే ఉండదు. ఆచార్య చాణక్యుడు మనం ఏ విషయాలు దాచుకోవాలో వేటిని బయట పెట్టుకోవాలో సూచించాడు.

    భద్రత

    ఒకరికి సంబంధించిన సమాచారాన్ని బయట పెట్టకూడదు. ఒకవేళ అలా చేస్తే అతడి భద్రతకు ముప్పు ఏర్పడవచ్చు. మనకు తెలిసినా ఇంకొకరి సమాచారం, కార్యకలాపాలు, రహస్య ఎజెండా, తదితర విషయాలు ఎప్పుడు బహిర్గతం చేయరాదు. మనకు తెలియకుండా చేస్తే అతడి మనుగడకు ప్రమాదం రావచ్చు. అందుకే మనకు తెలిసినా కూడా ఇతరుల విషయాలు పొరపాటున కూడా బయట పెట్టడం మంచిది కాదని తెలుసుకోవాలి.

    వ్యూహాలు

    పనుల నిర్వహణలో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. ఇతరుల వ్యూహాలు మనం బహిర్గతం చేయకూడదు. ఏ వ్యక్తి అయినా తగిన ప్రణాళికలు, వ్యూహాలు ఏర్పరచుకుని పనులు చేసుకుంటారు. మనం వారి వ్యూహాలు ఇతరులకు చెబితే అతడి పనులు కుంటుపడొచ్చు. అప్పుడు అతడు మరో వ్యూహాన్ని అమలు చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఇతరుల వ్యూహాలు మనం చెప్పకూడదు.

    ఆస్తి విలువలు

    ఇతరుల ఆస్తుల వివరాలు కూడా బయట పెట్టకూడదు. ఇంటి గుట్టు ఎప్పుడు బయట చెప్పకూడదు. మన ఆస్తి అయినా ఇతరుల ఆస్తుల వివరాలు అయినా ఇతరుల ముందు ఏకరువు పెట్టకూడదు. ఇది ఎదుటి వారికి బలంగా మారుతుంది. మనకు బలహీనత అవుతుంది. ఇతరులకు అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే మన ఆస్తుల విలువ ఎప్పుడు బయట పెట్టకుండా జాగ్రత్తలు పాటించాలి.

    గుట్టుగా ఉండాలి

    మనకు కలిగే సంపద విషయంలో కూడా ఎప్పుడు ఇతరులతో చర్చించవద్దు. అలా చేస్తే వారి కన్ను మన ఇంటి మీద పడుతుంది. దీని వల్ల నర దిష్టి పడితే రాయి అయినా కరుగుతుంది అంటారు. అలా మన సంపద కరిగిపోయే ప్రమాదం ఉంటుంది. మనకు కలిగే డబ్బు గురించి ఎక్కడ ప్రస్తావించకూడదు. రహస్యంగానే ఉంచుకుంటేనే సురక్షితం.

    చేయాల్సిన పని

    మనం రోజు ఎన్నో పనులు చేస్తుంటాం. ఎప్పుడు కూడా మనం చేయబోయే పని ఇతరులకు చెప్పకూడదు. అలా చెబితే ప్రత్యర్థులు పనిలో ఆటంకాలు కల్పించేందుకు సిద్ధమవుతారు. మన లక్ష్యం ఎవరితోనూ పంచుకోకూడదు. మనం చేసే పనులు ఇతరులకు తెలియకుండా ఉండటమే శ్రేయస్కరం. అప్పుడే మనకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి.