https://oktelugu.com/

Yuvraj Singh: ఇంత మంది హీరోయిన్స్ తో… యూవీ క్రికెట్ లోనే కాదు అమ్మాయిల విషయంలో కూడా మంచి ఆటగాడే…

యువరాజ్ తన ఎంటైర్ కెరీర్ లో 8 మంది బాలీవుడ్ హీరోయిన్లతో ఏర్పాటు చేసుకున్న సంబంధమే ఎప్పుడు ఆయన్ని వార్తల్లో నిలచేలా చేస్తూ వచ్చింది. అంతమంది అమ్మాయిలతో డేటింగ్ చేసిన యువరాజ్ మొత్తానికైతే...

Written By:
  • Gopi
  • , Updated On : April 11, 2024 / 10:47 AM IST

    Yuvraj Singh dated these 8 Bollywood actresses

    Follow us on

    Yuvraj Singh: ఇండియన్ క్రికెట్ హిస్టరీలో యువరాజ్ సింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2007 లో జరిగిన టి20 వరల్డ్ కప్,అలాగే 2011 లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఈ రెండు కూడా మనకు రావడంలో ఈయన కీలక పాత్రను పోషించాడు. ఇక యువరాజ్ ప్లేయర్ గా ఎంత బాగా పాపులర్ అయ్యాడో అంతకుమించి అమ్మాయిల కలల రాకుమారుడుగా కూడా మారాడు. ఇక అమ్మాయిల విషయంలో చాలావరకు కాంట్రవర్సీలను కూడా ఎదుర్కొంటూ వచ్చాడు. ఇక యువరాజ్ తన ఎంటైర్ కెరీర్ లో 8 మంది బాలీవుడ్ హీరోయిన్లతో ఏర్పాటు చేసుకున్న సంబంధమే ఎప్పుడు ఆయన్ని వార్తల్లో నిలచేలా చేస్తూ వచ్చింది. అంతమంది అమ్మాయిలతో డేటింగ్ చేసిన యువరాజ్ మొత్తానికైతే “హాజెల్ కీచ్” ను పెళ్లి చేసుకొని ప్రస్తుతానికి హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు.ఇక ఆయన డేటింగ్ చేసిన హీరోయిన్లు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం…

    కిమ్ శర్మ
    “మొహబ్బతే ” సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న కిమ్ శర్మ తో యువరాజ్ మొదట ప్రేమాయణాన్ని నడిపించాడు. అయితే కొద్ది రోజుల వరకు వీళ్ళ బంధం సాఫీగా సాగినప్పటికీ ఆ తర్వాత యువరాజ్ వల్ల అమ్మ ఎన్టీయార్ అవ్వడం తో ఈ బంధం అనేది నిలిచిపోయినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి…

    ప్రీతి జింగనియా
    కిమ్ శర్మతో విడిపోయిన తర్వాత షారుక్ ఖాన్ హీరోగా నటించిన “మోహబ్బతేన్” సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రీతి జింగానీయతో కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన యువరాజ్ ఆమెను పెళ్లి చేసుకుంటాడు ఏమో అని అందరూ అనుకున్నారు. కానీ అందరికీ షాకిస్తూ తనతో బ్రేకప్ చేసుకున్నాడు…

    దీపిక పదుకునే
    షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన “ఓం శాంతి ఓం” సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన “దీపికా పదుకొనే” 2007 t20 వరల్డ్ కప్ జరిగిన సమయంలో యువరాజ్ కి చాలా దగ్గర అయిందనే వార్తలు అయితే వచ్చాయి. గ్రౌండ్ లో యువరాజ్ సిక్స్ కొట్టిన ప్రతిసారి తను స్టేడియంలో నుంచి అతన్ని ఎంకరేజ్ చేస్తు స్టేడియం లో హల్చల్ చేసింది. ఇక సక్సెస్ ను దీపికా సెలబ్రేట్ చేసుకోవడం చూసిన ప్రతి ఒక్కరు వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అనే అనుమానాలను వ్యక్తం చేశారు. ఇక దానికి తగ్గట్టుగానే యువరాజ్ సింగ్ బర్త్ డే ను కూడా తను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసినట్టుగా వార్తలైతే వచ్చాయి. ఇక మొత్తానికైతే వీరిద్దరి మధ్య మంచి లవ్ అయితే ఉంది అని అందరు అనుకున్నారు. కానీ మధ్యలోకి ధోని రావడంతో దీపిక యువరాజ్ కు బ్రేకప్ చెప్పినట్టుగా కూడా అప్పట్లో వార్తలైతే వచ్చాయి…

    రియా సేన్
    దీపిక పడుకునే బ్రేకప్ అయిపోయిన తర్వాత యువరాజ్ సింగ్ రియా సేన్ తో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యాడు. ఇక వీళ్లిద్దరు చాలా రోజులపాటు డేటింగ్ కూడా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎక్కడ చూసినా వీళ్ళిద్దరు పార్టీలు, పబ్బులు అంటూ చెట్టా పట్టా లేసుకొని తిరగడం చూసిన ప్రతి ఒక్కరు వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారు. తొందర్లోనే పెళ్లి చేసుకుంటారేమో అనుకున్నారు. కానీ అందరికీ షాకిస్తూ వీళ్ళిద్దరూ కూడా విడిపోవడం అప్పట్లో పలు రకాల చర్చలకు దారి తీసింది…

    మినిషా లాంబా
    యువరాజ్ సింగ్ మినిషా లాంబా ఇద్దరు ఒక పార్టీలో ఒకరికొకరు ముద్దులు ఇచ్చుకుంటూ దిగిన ఫోటోలు అప్పట్లో మీడియా లో వైరల్ అయ్యాయి. అయితే దీని మీద మనిషిలాంబా స్పందిస్తూ ఆ ఫోటోలో ఉన్నది నేను కాదు ఎవరో కావాలని అలా చేశారు అంటూ కామెంట్స్ చేయడం విశేషం…

    అంచల్ కుమార్
    ఇక తన చిన్ననాటి స్నేహితురాలైన అంచల్ కుమార్ తో కూడా యూవీ డేటింగ్ చేశాడు. ఐపీఎల్ సమయంలో వీళ్ళిద్దరూ పార్టీలు పబ్బులు అంటూ చెక్కర్లు కొట్టడం అప్పట్లో మీడియాలో సంచలనాన్ని సృష్టించింది. ఇక యువరాజ్ తన చిన్ననాటి మిత్రులైన అంచల్ కుమార్ ని పెళ్లి చేసుకుంటాడు అని అందరూ భావించారు. అయినప్పటికీ వీళ్ళ మధ్య కూడా బ్రేకప్ అయితే అయింది…