https://oktelugu.com/

Gnaneswari: బికినీ వేసిన యాంకర్ ప్రదీప్ కి కాబోయే భార్య… ఎవరీ జ్ఞానేశ్వరి? హాట్ లుక్ వైరల్

పెళ్లి చూపులు పేరుతో ఓ రియాలిటీ షో నిర్వహించాడు. ప్రదీప్ అంటే ఇష్టం ఉండి, పెళ్ళికి సిద్దమైన అమ్మాయిలు ఈ షోలో పాల్గొనవచ్చు. కాగా కొందరు అందమైన భామలను ఎంపిక చేశారు.

Written By:
  • S Reddy
  • , Updated On : April 11, 2024 / 10:36 AM IST

    Gnaneswari Kandregula Latest Pics Goes Viral

    Follow us on

    Gnaneswari: యాంకర్ ప్రదీప్ ఓ హాట్ బ్యూటీని పెళ్లాడాల్సింది. ఆమె పేరు జ్ఞానేశ్వరి. స్టార్ యాంకర్ గా ఎదిగిన ప్రదీప్ మాచిరాజు కొన్ని ప్రయోగాత్మక షోలు చేశాడు. వాటిలో పెళ్లి చూపులు ఒకటి. ప్రదీప్ కోసం స్వయంవరం లాంటిదే ఆ షో. నిజానికి అమ్మాయిలకు స్వయంవరం జరుగుతుంది. ఆ రోజుల్లో రాకుమారిని వరించేందుకు రాజులు పోటీపడేవారు. స్వయంవరం లో ఇతర రాజులను ఓడించి అమ్మాయిని సొంతం చేసుకునేవారు. ప్రదీప్ మాచిరాజు తన కోసం స్వయంవరం ఏర్పాటు చేసుకున్నాడు.

    పెళ్లి చూపులు పేరుతో ఓ రియాలిటీ షో నిర్వహించాడు. ప్రదీప్ అంటే ఇష్టం ఉండి, పెళ్ళికి సిద్దమైన అమ్మాయిలు ఈ షోలో పాల్గొనవచ్చు. కాగా కొందరు అందమైన భామలను ఎంపిక చేశారు. వారు దశల వారీగా పోటీపడ్డారు. వీరిలో జ్ఞానేశ్వరి అనే అమ్మాయి ప్రత్యేకత చాటుకుంది. ప్రదీప్ మాచిరాజు మనసు గెలిచింది. ఆ షో ఉద్దేశం ప్రకారం జ్ఞానేశ్వరి ప్రదీప్ పెళ్లి చేసుకోవాల్సింది. కానీ అలా జరగలేదు. కొన్నాళ్ళు వాళ్ళు రిలేషన్ లో ఉన్నారనే కథనాలు వెలువడ్డాయి.

    మరోవైపు జ్ఞానేశ్వరి మోడల్ గా , నటిగా రాణిస్తుంది. ప్రదీప్ అంటే తనకు అమిత ఇష్టం అని జ్ఞానేశ్వరి చెప్పడం విశేషం. కాగా జ్ఞానేశ్వరి తాజాగా బికినీలో దర్శనం ఇచ్చింది. టు పీస్ బికినీ ధరించి గ్లామర్ షోకి తెరలేపింది. ఆమె జీరో సైజ్ కట్ అవుట్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. జ్ఞానేశ్వరి హాట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

    జ్ఞానేశ్వరికి పెళ్లి చూపులు రియాలిటీ షో ఫేమ్ తెచ్చిన నేపథ్యంలో హీరోయిన్ గా కూడా ఆఫర్స్ వచ్చాయి. మిస్టర్ అండ్ మిస్ మూవీలో జ్ఞానేశ్వరి హీరోయిన్ గా నటించింది. అలాగే నీ జతగా, మాయలో, చక్రవ్యూహం చిత్రాల్లో ఆమె నటించారు. మరోవైపు ప్రదీప్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తరచుగా చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఆయన మాత్రం స్టిల్ బ్యాచ్ లర్ గా ఉన్నారు. యాంకరింగ్ కి బ్రేక్ ఇచ్చిన ప్రదీప్ తన నెక్స్ట్ ప్రాజెక్టు కి సిద్ధం అవుతున్నాడని సమాచారం…