https://oktelugu.com/

Pothina Mahesh: సుజనా చౌదరి నెత్తిన పాలు పోసిన పోతిన మహేష్

జనసేన ను వీడుతూ మహేష్ చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. పవన్ పై వ్యక్తిగత దాడి చేశారు. చివరకు ఆయన వైవాహిక జీవితం పై సైతం మాట్లాడారు. అయితే పోతిన మహేష్ కామెంట్స్ తో జన సైనికులు రియాక్ట్ అవుతున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : April 11, 2024 10:51 am
    Pothina Mahesh

    Pothina Mahesh

    Follow us on

    Pothina Mahesh: పోతిన మహేష్ జనసేన ను వీడడం ఎవరికి నష్టం? పవన్ కళ్యాణ్ కా? ఆయనకా? తాను జనసేన ను వీడితే కొబ్బరికాయలు నరికే కత్తితో తన చేతిని నరికేయండి అంటూ పోతిన మహేష్ గతంలో చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించారు. కానీ టికెట్ కేటాయించలేదన్న మనస్తాపంతో పోతిన మహేష్ జనసేన ను వీడారు. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. మహేష్ ఇప్పుడు నీకు ఏ కత్తితో నరికేయాలి అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ ప్రారంభమయ్యాయి.

    జనసేన ను వీడుతూ మహేష్ చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. పవన్ పై వ్యక్తిగత దాడి చేశారు. చివరకు ఆయన వైవాహిక జీవితం పై సైతం మాట్లాడారు. అయితే పోతిన మహేష్ కామెంట్స్ తో జన సైనికులు రియాక్ట్ అవుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. అయితే పోతిన మహేష్ తనకు తాను రాష్ట్రస్థాయి నాయకుడిగా ఊహించుకున్నారు. అయితే తన ఈ స్థాయికి పవన్ కళ్యాణ్ కారణమన్న విషయాన్ని మరిచిపోయారు. గత ఎన్నికల్లో జనసేన టికెట్ పై పోటీ చేసిన ఆయన మూడో ప్లేస్ కి పరిమితమయ్యారు. అయినా సరే పవన్ ఆయనకు విజయవాడ నగర బాధ్యతలు అప్పగించారు. ఆయన దూకుడుకు పవనే కారణం. దీంతో పోతిన మహేష్ కు రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చింది. అయితే అదేదో తన సొంత ఇమేజ్ అన్నట్టు మహేష్ వ్యవహరించారు. కేవలం టిక్కెట్ దక్కలేదన్న మనస్తాపంతో చేజేతులా తన భవిష్యత్తును పోగొట్టుకున్నారు.

    పొత్తులో భాగంగా ఇక్కడ సీటును బిజెపికి కేటాయించారు. దీంతో టీడీపీ తో పాటు జనసేనకు నిరాశ తప్పలేదు. కానీ అక్కడ బిజెపి తన అభ్యర్థిగా పారిశ్రామికవేత్త, జాతీయ నాయకుడు సుజనా చౌదరిని ప్రకటించింది. ఆయనకు టిక్కెట్ దక్కగానే వెంటనే పవన్ కళ్యాణ్ ను కలిశారు. పవన్ పోతిన మహేష్ ను పిలిపించి మాట్లాడారు. అయినా సరే తనలో ఉన్న అసంతృప్తిని మహేష్ తగ్గించుకోలేదు. వాస్తవానికి ఇక్కడ బిజెపికి సీటు కేటాయించడానికి జనసైనికులు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఓట్ల బదలాయింపు కూడా సక్రమంగా జరిగే పరిస్థితి కనిపించలేదు. కానీ ఇక్కడే సుజనా చౌదరి నెత్తిన పోతిన మహేష్ పాలు పోశారు. పవన్ అనరాని మాటలు అని జనసైనికులు హర్ట్ అయ్యేలా చేశారు. వారిలో కసి పెంచారు. దీంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో జనసైనికులు సంఘటితమయ్యారు. ఇప్పుడు కానీ కూటమి అభ్యర్థి గెలవకుంటే.. అది పవన్ కు మాయని మచ్చగా నిలుస్తుందని స్థిరమైన అభిప్రాయానికి వచ్చారు. సుజనా చౌదరిని ఎలాగైనా గెలిపించుకోవాలని భావిస్తున్నారు.