YSRCP Political Reactions: మరి కొద్ది గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ప్రీమియర్ షోస్ తో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఒక పక్క పవన్ కళ్యాణ్ అభిమానుల కోలాహలం ఉండనే ఉంది, మరో పక్క ఆయన దురాభిమానుల హడావిడీ కూడా చాలా గట్టిగానే ఉంది. ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో బుకింగ్స్ జరగడం లేదని కొందరు, మా రికార్డ్స్ ని ఎప్పటికీ అందుకోలేరని మరికొందరు, ఇలా ఎవరికీ తోచినట్టు వాళ్ళు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజకీయ పరంగా గత వైసీపీ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ మరియు రఘు రామ కృష్ణంరాజు విమర్శలు చేయడం పై వైసీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: హరిహరవీరమల్లును నెత్తిన పెట్టుకున్న జనసేన ఎమ్మెల్యేలు,. ఎమ్మెల్సీలు
సోషల్ మీడియా లో ‘#boycottHHVM’ అంటూ నేషనల్ వైడ్ గా వేలాది ట్వీట్స్ తో ట్రెండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తన ట్విట్టర్ ఖాతాలో వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారి హరి హర వీరమల్లు చిత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చి కాసుల కనకవర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. ఒకపక్క వైసీపీ కార్యకర్తలు ఈ సినిమాని చూడొద్దు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే, ఆ పార్టీ కి చెందిన ముఖ్య నాయకుడు ఇలా సూపర్ హిట్ అవ్వాలని కోరుకోవడం ఏంటి?, ఆయన కచ్చితంగా ఈ ట్వీట్ ని వ్యంగ్యంగానే వేసి ఉంటాడంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్ ని ఆయన పవన్ కళ్యాణ్ తో పాటు , నాగ బాబు ని కూడా ట్యాగ్ చేసి వేసాడు.
Also Read: ఇద్దరు దర్శకులు కలిసి చేసిన హరిహర వీరమల్లు మూవీ పరిస్థితి ఏంటి..?
‘హరి హర వీరమల్లు’ కు, నాగబాబు కు అసలు ఎలాంటి సంబంధం లేదు. ఈ చిత్రం లో ఆయన చిన్న క్యారక్టర్ కూడా చేయలేదు. అయినప్పటికీ నాగబాబు ని ట్యాగ్ చేసాడంటే ఏంటి అర్థం?, వ్యగ్యంగానే ఈ ట్వీట్ వేసినట్టు కదా లెక్క అని అంటున్నారు. పైగా హరి హర వీరమల్లు చిత్రం పై యాంటీ ఫ్యాన్స్ వేస్తున్న ట్రోల్స్ ని చూసి, ఈ చిత్రం పరిస్థితి తెలుసుకొని కావాలనే ఇలాంటి ట్వీట్ వేశాడని అంటున్నారు. వీటిల్లో ఏది నిజమో తెలియదు కానీ, అంబటి రాంబాబు ‘హరి హర వీరమల్లు’ కి శుభాకాంక్షలు తెలియజేయడం మాత్రం షాకింగ్ సర్ప్రైజ్ అనే చెప్పాలి.