Extramarital Relationships: ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంటి పెద్ద అన్ని వ్యవహారాలు పర్యవేక్షించేవారు. కుటుంబ సభ్యులు ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్లిపోయేవారు. ఇంటి పెద్ద భయం వల్ల నియమ నిబంధనలకు అనుగుణంగా కుటుంబ సభ్యులు జీవించేవారు. తద్వారా వైవాహిక జీవితంలో ఎటువంటి తప్పులకు ఆస్కారం ఇచ్చేవారు కాదు. అందువల్లే నాటి రోజుల్లో కుటుంబ సంబంధాలు.. భార్యాభర్తల మధ్య అనుబంధాలు బలంగా ఉండేవి. పైగా సమాజం పట్ల ఇంత అవగాహన ఉండేది కాదు. పరాయి వ్యక్తితో మాట్లాడాలంటే భయం ఉండేది. అందువల్లే నాటి కాలంలో ఇలాంటి తెరచాటు వ్యవహారాలకు అంతగా ఆస్కారం ఉండేది కాదు.
Also Read: భార్యకు వివాహేతర సంబంధం.. ప్రాణభయంతో ప్రియుడికి అప్పగించిన భర్త..
ఇప్పుడు అలా కాదు.. ఉమ్మడి కుటుంబాలు పూర్తిగా కనుమరుగైపోయాయి. మగ, ఆడవారిలో ఆర్థిక స్థిరత్వం పెరిగిపోయింది. స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరించడం ఎక్కువైంది. దీంతో వైవాహిక సంబంధాలకు బీటలు వారడం మొదలైంది. వివాహేతర సంబంధాలు ఏర్పరచుకోవటం.. భర్తలను అంతం చేయడం వంటి దారుణాలు చోటు చేసుకోవడం ఎక్కువైంది. అందువల్లే వివాహ సంబంధాలు అంత గొప్పగా ఉండడం లేదు. ప్రేమించి చేసుకున్న పెళ్లిళ్లు.. పెద్దలు కుదిర్చి చేసిన పెళ్లిళ్లు.. ఏవీ కూడా నిలబడటం లేదు. పైగా వివాహేతర సంబంధాలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. ఒకప్పుడు ఇవి పెద్ద పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమయ్యేవి. ఇప్పుడు నగరాలను దాటి ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు వివాహేతర సంబంధాలలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.
మనదేశంలో పెరిగిపోతున్న వివాహేతర సంబంధాలకు సంబంధించి ఆష్లే మాడిసన్ అనే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలలో దిగ్బ్రాంతి కరమైన వాస్తవాలు వెలుగు చూసాయి.. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు ఎందుకు ఏర్పరచుకుంటున్నారు అనే ప్రశ్నను ఆ సంస్థ సభ్యులు పలువురు వివాహితులను అడిగితే.. వారు మొహమాటం లేకుండా సమాధానం చెప్పారు. “ప్రేమ రాహిత్యం.. సరిగా పట్టించుకోకపోవడం.. మద్యం తాగడం. ఇతరులకు ప్రాధాన్యం ఇవ్వడం.. శృంగారపరంగా లోపాలు.. ఆర్థిక నేపథ్యం.. సామాజిక హోదా.. అన్నిటికంటే ఎక్కువగా వ్యక్తిత్వం ఇవన్నీ వివాహేతర సంబంధానికి దారితీస్తున్నాయని” ఆష్లే మాడిసన్ సంస్థ సర్వేలో వివాహితులు వెల్లడించారు. ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో దాదాపు 53 శాతం మంది తమకు వివాహేతర సంబంధం ఉందని అంగీకరించారు. ప్రపంచ వ్యాప్తంగా వివాహేతర సంబంధాలు ఏర్పరచుకుంటున్న వారి సంఖ్య భారత్, బ్రెజిల్ అధికంగా ఉంది..ఆష్లే మాడిసన్ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం తమిళనాడులోని కాంచీపురంలో వివాహేతర సంబంధాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. భారతదేశంలో ఈ పట్టణం మొదటి స్థానంలో ఉంది. ఈ పట్టణం తర్వాతే ఢిల్లీ, ముంబై వంటి మహా నగరాలు ఉన్నాయి.
Also Read: డబ్బు గురించి మీ పిల్లలకు ఈ విషయాలు తప్పక చెప్పాలి..
2024లో ఆష్లే మాడిసన్ నిర్వహించిన సర్వేలో కాంచీపురం 17వ స్థానంలో ఉండేది. కానీ ఏడాది తిరిగేలోపు ఈ పట్టణం వివాహేతర సంబంధాలలో మొదటి స్థానానికి చేరుకుంది.. అయితే ఇలా పెట్టడానికి నిర్దిష్టమైన కారణాలను సర్వే సంస్థ వెల్లడించకపోయినప్పటికీ.. మారుతున్న ధోరణులు ప్రజల జీవనశైలిని పూర్తిగా మార్చేస్తున్నాయని పేర్కొంది. జిల్లాల వారీగా చూస్తే సెంట్రల్ ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. సెంట్రల్ ఢిల్లీ, నైరుతి ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, గుర్గావ్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ (నోయిడా) , జై పూర్, రాయ్ గడ్, చండి గఢ్, ఘజియాబాద్, జైపూర్ వివాహేతర సంబంధా లలో టాప్ స్థానాలలో కొనసాగుతున్నాయి.
ఆష్లే మాడిసన్ కెనడా దేశానికి చెందిన ఆన్ లైన్ డేటింగ్ యాప్. మొదట్లో ఈ సంస్థ సక్రమంగానే కార్యకలాపాలు సాగించింది. ఆ తర్వాత డబ్బు కోసం అడ్డదారులు తొక్కింది.. భారీ డాటా ఉల్లంఘనకు పాల్పడండి. 37 మిలియన్ల మంది సమాచారాన్ని వేరే మార్గాల ద్వారా విక్రయించింది. ఇదే విషయాన్ని పోర్బ్స్ ఇండియా బయట పెట్టింది. అయితే ఈ వ్యవహారం తర్వాత ఆష్లే మాడిసన్ తన మాతృ సంస్థ రూబీ లైఫ్ ద్వారా భారత దేశంలో కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే మార్కెటింగ్ నిర్వహిస్తోంది..వివాహేతర సంబంధాలపై సర్వే నిర్వహించింది. అయితే గతంలో వినియోగదారుల సమాచారాన్ని బయటకి పంపించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ తరహా సర్వే చేసి ఇండియాలో తన వ్యాపారాన్ని కొనసాగించాలనుకుంటుంది. అయితే ఈ సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో వివాహేతర సంబంధాలను ఏమాత్రం తప్పు పట్టకపోవడం విశేషం. పైగా వాటిని ప్రేమకు నిదర్శనాలని పేర్కొనడం గమనార్హం.