Hari Hara Veeramallu premiere shows cancelled: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరికొద్ది గంటల్లోనే మొదలు అవ్వబోతున్నాయి. కానీ అభిమానుల్లో, ఈ సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్స్ లో టెన్షన్ మామూలు రేంజ్ లో లేదు. అందుకు ముఖ్య కారణం నిర్మాతల జాప్యమే. ఒక పాన్ ఇండియన్ చిత్రం కోసం ఆరేళ్ళు కష్టపడ్డాము అని మీడియా ముందు చెప్పుకుంటూ వచ్చారు, సరే..అక్కడి వరకు బాగానే ఉంది. కానీ అనుకున్న సమయం లో కంటెంట్ ని డెలివరీ చేయకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఉదాహరణకు ఓవర్సీస్ తీసుకుందాం. ఇప్పటి వరకు ప్రీమియర్ షోస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తి స్థాయిలో మొదలు అవ్వలేదు. అందుకు కారణం కంటెంట్ ఇంకా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళకపోవడం వల్లే. నార్త్ అమెరికా లో అయితే అనేక ప్రాంతాల్లో ప్రీమియర్ షోస్ ని రద్దు చేశారు.
ఈరోజు తెల్లవారు జామున ప్రీమియర్ షోస్ కి సంబంధించిన ప్రింట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. కానీ AMC , రెగల్ లాంటి థియేటర్స్ చైన్స్ ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా రన్ అయ్యేవి. అంటే వాళ్లకు కచ్చితంగా హార్డ్ డ్రైవ్ ఉండాలి అన్నమాట. అవి అందుబాటులో లేకపోవడంతో దాదాపుగా 60 డాలర్స్ విలువ గల అడ్వాన్స్ బుకింగ్స్ రద్దు అయ్యింది. అంతే కాకుండా కంటెంట్ అనుకున్న సమయానికి డెలివరీ అయ్యి ఉండుంటే డిస్ట్రిబ్యూటర్ మరో వెయ్యి షోస్ ని అదనంగా షెడ్యూల్ చేసి ఉండేవాడు. అంటే రెండు వేల షోస్ ఉండేవి అన్నమాట. అనుకున్న టైం లో కంటెంట్ ని డెలివరీ చేయకపోవడం వల్ల ఆ షోస్ ఇప్పుడు షెడ్యూల్ చేయలేదు. కేవలం వెయ్యి షోస్ తో , 5 లక్షల డాలర్ల అడ్వాన్స్ గ్రాస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నాని, విజయ్ దేవరకొండ లాంటి వాళ్లకు వచ్చిన షోస్ ఇవి. ఇది పవన్ కళ్యాణ్ స్టార్ స్టేటస్ కి అత్యంత అవమానకరం అనే చెప్పాలి.
Also Read: హరిహరవీరమల్లును నెత్తిన పెట్టుకున్న జనసేన ఎమ్మెల్యేలు,. ఎమ్మెల్సీలు
కేవలం ఓవర్సీస్ లో మాత్రమే కాదు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లో కూడా ఇదే పరిస్థితి. ఈరోజు రాత్రి ప్రీమియర్ షోస్ ఉంటే, హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఒక్క ప్రీమియర్ షో ని కూడా షెడ్యూల్ చేయలేదు. అంతే కాకుండా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ సింగిల్ స్క్రీన్స్ కి సంబంధించినవాటికి ఒక్క దానికి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవ్వలేదు. కారణం ఇండియా లో క్యూబ్ థియేటర్స్ కి ఇంకా కంటెంట్ డెలివరీ అవ్వకపోవడం వల్లే. కంటెంట్ మా చేతుల్లోకి వచ్చేంత వరకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టమని వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. ఇప్పుడు రాత్రి ప్రీమియర్ షోస్ పడుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.