Hari Hara Veera Mallu Directors: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా జ్యోతి కృష్ణ (Jyothi Krishna) దర్శకత్వంలో వస్తున్న Hari Hara Veeramallu) సినిమా రేపు రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ఈరోజు నుంచే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ అయితే ఉంది. మరి ఈ సినిమాని ఇద్దరు దర్శకులు తెరకెక్కించారు. కాబట్టి సినిమా అనుకున్నంత రేంజ్ లో ఔట్ పుట్ అయితే వచ్చి ఉండదు. ఎందుకంటే ఈ కథను రాసింది క్రిష్… ఈ సినిమాను ఆయన 40% తెరకెక్కించాడు. అప్పట్లో ఈ సినిమాకి మంచి హైప్ అయితే వచ్చింది. మరి ఆ తర్వాత ఆయన సినిమా నుంచి తప్పుకోవడం జ్యోతి కృష్ణ (Jyothi Krishna) ఎంటరవ్వడం ఇవన్నీ చక చక జరిగిపోయాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా అవుట్ విషయంలో కొంతవరకు కాంప్రమైజ్ అయితే అయినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సినిమా స్టార్ట్ చేసి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతోంది. అనేదాని మీద చాలావరకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అయిన నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ మాత్రం అంత ఎఫెక్టివ్ గా లేదు. అందులో సీజీ వర్క్స్ అనేవి ఈజీగా తెలిసిపోతున్నాయి…
Also Read: SSMB 29కి బ్రేక్… మహేష్, రాజమౌళి ఏం చేస్తున్నారో తెలుసా?
ఇద్దరి దర్శకులు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అవుట్ పుట్ తేడా కొట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత సినిమా చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా సక్సెస్ అయితే చూడాలని అతని అభిమానులు ఆనందపడుతున్నారు.
మరికొందరు మాత్రం సినిమా సక్సెస్ అయిన అవ్వకపోయినా సినిమా చూసి పవన్ కళ్యాణ్ కి కలెక్షన్స్ ను పెంచాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది… పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని భారీ ఎత్తున చేస్తున్నాడు. ఇప్పటికే మూడు నాలుగు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు…
Also Read:అక్షరాలా 2,50,000 టికెట్స్..గ్రాస్ విషయంలో ‘హరి హర వీరమల్లు’ నయా రికార్డు!
ఇలాంటి సందర్భంలో ఆయన నుంచి వస్తున్న ఈ సినిమా సక్సెస్ ని సాధించి ఆయనకు గొప్ప గుర్తింపు తీసుకొస్తుందా లేదా ఇద్దరు దర్శకుల మధ్యలో ఇది కిచిడి అయిపోతుందా? అనేది తెలియాలంటే మాత్రం మరికొన్ని గంటల పాటు వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది…ఇక ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం దర్శకుడు జ్యోతి కృష్ణ కి కూడా మంచి పేరు వస్తుంది…