Jr NTR: జూనియర్ ఎన్టీఆర్, రణవీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన సినిమా బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. కానీ వినాయక చవితి దృష్ట్యా భద్రత ఇబ్బందులు వస్తాయని పోలీసులు అనుమతి నిరాకరించడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. అభిమానులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని వేడుకున్నారు. సమాజ ప్రయోజనాల కోసం మనం కొన్ని త్యాగాలు చేయక తప్పని పరిస్థితి. అందుకే భద్రత కారణాల నేపథ్యంలో ఫంక్షన్ రద్దు చేసుకోవడం జరిగింది.

బ్రహ్మాస్త్ర హిందీతోపాటు తెలుగు, తమిళం భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల కానుంది. దీంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ప్రతిభకు ఆస్కార్ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీంతో బ్రహ్మాస్త్ర కూడా మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో ప్రేక్షకులు సంయమనం పాటించాలని ఎన్టీఆర్ కోరారు. బ్రహ్మాస్త్రను సూపర్ హిట్ చేయాలని ఆకాంక్షించారు.
Also Read: Rashmi Gautam: ఆ మూడు రోజుల నొప్పే నేను భరించలేను… మళ్ళీ మళ్ళీ గర్భం అంటే ఇక అర్థం చేసుకోండి
గణేష్ నవరాత్రోత్సవాల నేపథ్యంలో పోలీసులు ఈవెంట్ కు నిరాకరించడం మామూలే. దాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. ఈ మేరకు ఎన్టీఆర్ ఓ హోటల్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈవెంట్ రద్దు కావడంపై వివరణ ఇచ్చారు. అభిమానులు ఆవేశానికి గురి కావద్దని హితవు పలికారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సినిమా మాత్రం బ్రహ్మాండమైన హిట్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొదటి సారి హిందీలో నటించడం కొత్తగా ఉందని చెబుతున్నారు. సినిమా బాగా వచ్చిందని వెల్లడించారు.

బ్రహ్మస్త్ర చిత్ర పరిశ్రమకే ఓ బ్రహ్మాస్త్రం కానుందని ఆకాంక్షిస్తున్నారు. సెప్టెంబర్ 9న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో సినిమాపై అందరిలో ఎన్నో ఆశలు పెరుగుతున్నాయి. ఎన్టీఆర్ నటన ఎలా ఉండబోతోందనే దాని మీద ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ శక్తి ఏమిటో అందరికి తెలిసిందే. పాత్రలో నటించరు జీవిస్తారు. దీంతో బ్రహ్మాస్త్ర చిత్రం గురించి అటు హిందీతో పాటు తెలుగు అభిమానులు ఎక్కువ మంది ఆతృతగా ఉన్న సంగతి తెలిసిందే. మొత్తానికి విడుదలకు ముందే బ్రహ్మాస్త్ర సంచలనం సృష్టిస్తోంది.
Also Read:Brahmastra prerelease event: జూ.ఎన్టీఆర్, రామోజీరావులకు షాకిచ్చిన కేసీఆర్