Rashmi Gautam: యాంకర్ రష్మీ గౌతమ్ ఓ నెటిజెన్ కామెంట్ కి తనదైన శైలిలో సమాధానం చెప్పింది. నువ్వు హిందూ వ్యతిరేకివని కామెంట్ చేసిన అతనికి తన సమాధానం విడమరిచి చెప్పింది. విషయంలోకి వెళితే… రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలన్న విషయం తెలిసిందే. మూగజీవాలు ఏ రూపంలో బాధపడుతున్నా, ఎవరైనా భాదపెడుతున్నా ఆమె స్పందించకుండా ఉండలేరు. అయితే గణపతి ఉత్సవాల్లో భాగంగా ఓ ఏనుగు చేత వినాయక విగ్రహం మెడలో దండ వేయించారు. ఈ ఘటనను రష్మీ తప్పుబడ్డారు. ఆ ఏనుగు ఆ సమయంలో ఎంత బాధను అనుభవించి ఉంటుందో అంటూ.. ఆమె ట్వీట్ చేశారు.

ఆమె కామెంట్ ఓ వ్యక్తిని హర్ట్ చేసినట్లు ఉంది. రష్మీకి కామెంట్ కి సమాధానంగా.. మీరు జంతు ప్రేమికురాలు కాదు, హిందూ వ్యతిరేకి.. అంటూ రిప్లై పెట్టాడు. అతడి అభిప్రాయానికి రష్మీ సమాధానం చెప్పారు. నేను నంది, గోమాతలను గౌరవిస్తాను. అందుకే తోలు వస్తువులు వాడను. మిల్క్ ప్రొడక్షన్స్ తినను. ఎందుకంటే మనం ఉపయోగించే పాల కోసం ఒక ఆవు అనేక సార్లు గర్భం దాల్చాల్సి వస్తుంది. ఒక ఆడదానిగా పీరియడ్స్ రోజుల్లో వచ్చే బాధనే తట్టుకోలేను. అలాంటిది గోమాతను పాల కోసం పదే పదే గర్భవతిని చేయడం అంటే ఎంత దారుణమో ఆలోచించండి… అంటూ ఆమె ట్వీట్ చేశారు. రష్మీ గౌతమ్ ట్వీట్ వైరల్ గా మారింది.
చాలా కాలంగా రష్మీ గౌతమ్ మూగజీవాల రక్షణ కోసం పోరాడుతున్నారు. జీవాల పట్ల ఎవరైనా అమానుషంగా ప్రవర్తిస్తే రష్మీ చలించిపోతారు. జంతువులు హింసించిన వారిపై చర్యలు తీసుకునేలా సంబంధిత సంస్థల ప్రతినిధులకు సమాచారం పంపుతారు. రాత్రి వేళల్లో వీధి కుక్కలకు రష్మీ భోజనం పెడతారు. రష్మీలోని ఈ లక్షణం ఆమె పట్ల గౌరవం పెంచుతుంది.

మరోవైపు రష్మీ యాంకర్ గా సూపర్ ఫార్మ్ లో ఉన్నారు. అనసూయ నిష్క్రమణతో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్స్ గా రష్మీ వ్యవహరిస్తున్నారు. అనసూయ స్థానంలో కొత్త యాంకర్ వస్తుందని అందరూ భావించారు . కానీ అనుభవం ఉన్న రష్మీనే మల్లెమాల వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఈ రెండు షోస్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ గా రష్మీ సందడి చేస్తుంది. హీరోయిన్ గా మాత్రం ఆమెకు అవకాశాలు తగ్గాయి. గతంలో రష్మీ హీరోయిన్ గా వరుస చిత్రాలు చేశారు. అయితే అవేమీ సరైన విజయం సాధించకపోవడంతో ఆఫర్స్ తగ్గాయి. యాంకర్ గా మాత్రం అమ్మడు దూసుకుపోతున్నారు.
Also Read:Vijay Devarakonda: రోడ్డునపడ్డ పూరి-చార్మిలను ఆదుకున్న విజయ్ దేవరకొండ.. ఆ 6 కోట్లు వెనక్కి
[…] […]