Uday Kiran- Rajamouli: తెలుగు చిత్ర సీమలో ఉదయ్ కిరణ్ గురించి పరిచయం అక్కర్లేదు. లవర్ బాయ్ గా పిలుచుకునే ఉదయ్ కెరీర్ ఎంత వేగంగా పైకి లేచిందో అంతే స్పీడ్ గా పడిపోవడం తెలిసిందే. దీంతో సినిమా అవకాశాలు రాక జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుని పదేళ్లయినా ఇంకా మన కళ్ల ముందే ఉన్నట్లు అనిపిస్తోంది. మనిషి ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని నిలబడటానికి ఎన్నో మార్గాలున్నా అనవసరంగా తనువు చాలించాడనే వాదనలు కూడా ఉన్నాయి. ప్రేమ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి యూత్ లో జోష్ నింపాడు. ప్రేమికులకు దిశా నిర్దేశం చేశాడు. ఆయన స్ఫూర్తితో చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకుని స్థిరపడ్డారు.

ఉదయ్ కిరణ్ ఓ పెద్ద తప్పు చేశాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. మూస పద్ధతిలో ప్రేమ కథా చిత్రాలకే ప్రాధాన్యం ఇచ్చాడు. దీంతో మాస్ ఆడియన్స్ బోరుగా ఫీలయ్యారనే తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న హీరోలు అటు లవ్ సినిమాలు, ఇటు మాస్, మరో వైపు ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రాలు తీస్తూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు పాన్ ఇండియా స్థాయిలో ఎదుగుతున్నారు. ఉదయ్ కిరణ్ కు కూడా ఆ స్థాయి వచ్చేది. అలా కాకుండా లవ్ చిత్రాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తన భవిష్యత్ ను తానే నాశనం చేసుకున్నాడని చెబుతున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి నితిన్ తో తీసిన సై సినిమా మొదట ఉదయ్ కిరణ్ దగ్గరకే వెళ్లిందట. కానీ ఆయన తిరస్కరించడంతో నితిన్ తో చేసి హిట్ కొట్టాడు. ఆ సినిమాతోనే నితిన్ మాస్ స్టార్ గా ఎదిగాడు. అది కూడా ఒక తప్పే అని తెలుస్తోంది. రాజమౌళి ఇచ్చిన ఆఫర్ వినియోగించుకుంటే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. మాస్ హీరోగా మరోమారు తన సత్తా చాటి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేవాడు. కానీ అతడు చేసిన తప్పిదాలే ఆయన ముప్పుకు కారణాలయ్యాయి.

ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎవరి అండ లేకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసిందే. మనిషి ఎదుగుతున్న క్రమంలో అన్ని మార్గాలను అనుసరించాలి. ఒకటే తోవలో వెళతానంటే కుదరదు. అన్ని అంశాలను లెక్కలోకి తీసుకుని మనం అనుకున్న రంగంలో రాణించాలంటే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇవేమీ పట్టించుకోకపోవడంతో ఉదయ్ జీవితం అర్థంతరంగా ముగిసిపోయింది. ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఉదయ్ లేకున్నా ఆయన చిత్రాలు మాత్రం మనకు ఆయన్ను గుర్తు చేస్తుంటాయి. ఇదే తప్పు తరుణ్ కూడా చేసి పరిశ్రమకు దూరమైన సంగతి తెలిసిందే. అందుకే హీరోలు అన్ని అంశాల మేళవింపుతో సినిమాలు తీస్తేనే పది కాలాల పాటు జనం గుండెల్లో గూడు కట్టుకుంటారని తెలిసిందే.