Anasuya Bharadwaj : జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ నాని సంపాదించుకున్న వాళ్ళలో యాంకర్ అనసూయ ఒకరు. ఆ షో ద్వారా తనకు మంచి క్రేజ్ రావడమే కాకుండా సినిమాలలో అవకాశాలు కూడా వచ్చాయి. దాంతో వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక తన సినిమాల ద్వారా ఎంత ఫేమస్ అయిందో, కాంట్రవర్సీల ద్వారా అంతకంటే ఎక్కువ ఫేమస్ అయింది. తను ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ ఇరుక్కుంటూ ఉంటారు… రీసెంట్ గా యాక్టర్ శివాజీ హీరోయిన్ ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనే విషయం మీద కొన్ని కామెంట్స్ చేశాడు. దాంతో అనసూయ అతనికి కౌంటర్ ఇస్తూ కొన్ని ఘాట్ కామెంట్స్ అయితే చేసింది. దాంతో నెటిజన్లు చెలరేగిపోయారు. నిజానికి అనసూయ షోస్ లో మాట్లాడేవాన్ని బూతు మాటలే వాటి గురించి మాట్లాడకుండా శివాజీ బూతులు మాట్లాడాడు అంటూ అతని మీద ఫైర్ అవుతోంది. హీరోయిన్స్ గురించి ఆశివాజీ మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆమె చేసిన కామెంట్లకు ప్రతి ఒక్కరు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.
ఆమె ఒక షోలో హైపర్ ఆదితో కలిసి రాశి గారిని డి గ్రేడ్ చేస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…రాశి గారు సైతం అనసూయ మీద ఆ షో కి జడ్జ్ గా వ్యవహరించిన రోజా మీద ఫైర్ అయ్యారు. ఇక దాంతో గత నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియా మొత్తం ఇదే న్యూస్ నడుస్తోంది. దాంతో అనసూయ రాశి కి సారీ చెబుతూ ఒక పోస్ట్ అయితే పెట్టారు.
నాకు తెలుగు సరిగ్గా రాని కారణంగా ఆ స్కిట్ లో మీ పేరు ను ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. నేను ఆ మాటల మీద ఆ రోజు ఆ రైటర్ ను డైరెక్టర్ ను అడిగి ఉంటే బాగుండేది. కానీ అప్పుడు నేను అడిగే స్థాయిలో లేను అంటూ రాసుకు వచ్చింది…ఆ షో డైరెక్టర్ రచయితలు మీకు క్షేమాపణలు చెప్పిన చెప్పకపోయిన నేను మాత్రం చెబుతున్నాను ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్ అంటూ ఆ పోస్ట్ లో రాశారు.
ఇక ఆ తర్వాత ద్వాందర్థపు మాటలు నాకు నచ్చలేదని నేను చాలా సార్లు ఖండించాను. చివరికి నేనే ఆ షో నుంచి బయటికి వచ్చేశాను…మహిళల భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్ననని నాకు వ్యతిరేకంగా కావాలనే కొంతమంది అప్పుడెప్పుడే నేను చేసిన కామెంట్స్ ను వైరల్ చేస్తున్నారు అంటూ ఆమె ఆ పోస్ట్ లో తెలియజేశారు…