https://oktelugu.com/

Teja Sajja: యంగ్ హీరో తేజా సజ్జాకు వింత అనుభవం ఎదురైంది. ఓ వృద్ధుడు ఆయన కాళ్ళు మొక్కాడు. ఆ అజ్ఞాత వ్యక్తి అలా చేయడం వెనుక ఓ కారణం ఉంది. అదేమిటో చూద్దాం..

యంగ్ హీరో తేజా సజ్జాకు వింత అనుభవం ఎదురైంది. ఓ వృద్ధుడు ఆయన కాళ్ళు మొక్కాడు. ఆ అజ్ఞాత వ్యక్తి అలా చేయడం వెనుక ఓ కారణం ఉంది. అదేమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : November 24, 2024 / 09:00 PM IST

    Teja Sajja

    Follow us on

    Teja Sajja: చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తేజా సజ్జా హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఆయన హనుమాన్ రూపంలో భారీ బ్లాక్ బస్టర్ నమోదు చేశాడు. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు హనుమాన్ రాబట్టింది. ఒక చిన్న హీరో సినిమా వందల కోట్ల వసూళ్లు రాబట్టడం అనేది గొప్ప విషయం. కేవలం కంటెంట్ కారణంగా ఆ సినిమా ఎవరూ ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. సంక్రాంతి బరిలో దిగిన మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్స్ కి షాక్ ఇస్తూ తేజా సజ్జా సంక్రాంతి విన్నర్ అయ్యాడు.

    ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగం హనుమాన్ తెరకెక్కించాడు. తేజా సజ్జాను సూపర్ మ్యాన్ గా ప్రజెంట్ చేశాడు. హనుమాన్ సక్సెస్ నేపథ్యంలో గోవా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) లో హనుమాన్ టీమ్ పాల్గొన్నారు. హనుమాన్ చిత్రాన్ని గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ప్రదర్శన ముగిసిన అనంతరం మాట్లాడేందుకు తేజ సజ్జా థియేటర్ లోని స్క్రీన్ ఎదుటకు వచ్చాడు. అప్పుడు ఓ వృద్ధుడు తేజా సజ్జా కాళ్ళు మొక్కాడు.

    తేజా సజ్జా ఆ వృద్ధుడిని వారించి ఆపాడు. నమస్కారం పెట్టాడు. ఆయనెవరో పరమ భక్తుడిలా ఉన్నారు. తేజా సజ్జాను హనుమాన్ లా భావించి అయన కాళ్లకు నమస్కారం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కేవలం ప్రశాంత్ వర్మ కారణంగానే హనుమాన్ సాధ్యమైంది. హనుమాన్ మూవీ నాపై బాధ్యత పెంచింది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మంచి సినిమాలు చేస్తాను, అని తేజా సజ్జా అన్నారు.

    హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ వస్తుంది. ఈ చిత్రంలో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తేజా సజ్జా చిన్న పాత్రలో కనిపిస్తాడని సమాచారం. ప్రస్తుతం తేజ సజ్జా మిరాయ్ టైటిల్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. మిరాయ్ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. సమ్మర్ కానుకగా 2025 మే 18న విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రంతో తేజా సజ్జా ఇమేజ్ మరో స్థాయికి చేరే సూచనలు కలవు.