https://oktelugu.com/

సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ.. రంగం సిద్ధం !

సూపర్ స్టార్ రజినీకాంత్ వైద్యుల సలహా మేరకు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. ఇక ఇప్పట్లో ఆయన సినిమా చెయ్యడు అని రూమర్స్ కూడా బాగా వినిపించాయి. అయితే తలైవా మళ్లీ షూటింగ్‌లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు. ఈ వార్త వినగానే రజిని అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. రజిని చేస్తోన్న కొత్త చిత్రం ‘అన్నాత్తే’ (అన్నయ్య) సినిమా కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ, ‘అన్నాత్తే’ షూటింగ్‌ గత ఏడాది చివర్లో హైదరాబాద్‌లో జరిగినప్పుడు యూనిట్‌లో […]

Written By:
  • admin
  • , Updated On : February 12, 2021 / 10:06 AM IST
    Follow us on


    సూపర్ స్టార్ రజినీకాంత్ వైద్యుల సలహా మేరకు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. ఇక ఇప్పట్లో ఆయన సినిమా చెయ్యడు అని రూమర్స్ కూడా బాగా వినిపించాయి. అయితే తలైవా మళ్లీ షూటింగ్‌లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు. ఈ వార్త వినగానే రజిని అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. రజిని చేస్తోన్న కొత్త చిత్రం ‘అన్నాత్తే’ (అన్నయ్య) సినిమా కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ, ‘అన్నాత్తే’ షూటింగ్‌ గత ఏడాది చివర్లో హైదరాబాద్‌లో జరిగినప్పుడు యూనిట్‌లో నలుగురికి కరోనా రావడంతో ఈ సినిమా షూటింగ్‌కి మొత్తానికే బ్రేక్‌ పడింది.

    Also Read: సినిమాల వల్లే నా భార్య నాకు విడాకులిచ్చింది.. ప్రముఖ నటుడి ఆవేదన

    ఆ తరువాత రజినికి ఆరోగ్య సమస్యలు.. ఇలా ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో ఉండదు అనుకుంటున్న సమయంలో.. రజనీ తన విశ్రాంతిని పక్కన పెట్టి షూట్ కి సిద్ధం అయ్యాడు. సినిమాని నవంబరు 4న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది కాబట్టి, అప్పటిలోగా షూటింగ్‌ ను పూర్తీ చేయాలి కాబట్టి, దర్శకుడు శివకి రజిని షూట్ ఫిక్స్ చేసుకోమని చెప్పాడట. అందుకే ఈ ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదటి వారంలో చిత్రీకరణ ఆరంభించడానికి దర్శకుడు సన్నాహాలు చేసుకుంటున్నాడు.

    Also Read: నితిన్ ‘చెక్’ బేరం అదుర్స్.. విడుదలకు ముందే లాభాలు

    నిజానికి, రజినీకాంత్ ఈ సినిమా ఈ ఏడాది పూర్తి చేస్తాడా? లేదా అనే అనుమానం ఉన్న తరుణంలో.. ఏకంగా ఇలా షూటింగ్ లో జాయిన్ అవ్వదానికి రెడీ అవ్వడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. జరగబోయే లాంగ్ షెడ్యుల్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుందని.. దాంతో సినిమా దాదాపుగా పూర్తి అవుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మీనా, ఖుష్బూ కూడా నటిస్తున్నారు. మరోపక్క సూపర్ స్టార్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా రజినీ – శివ కాంబినేషన్ పట్ల చాలా ఆసక్తిని చూపిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్