spot_img
Homeఎంటర్టైన్మెంట్Young Directors targeting Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన కుర్ర దర్శకులు...

Young Directors targeting Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన కుర్ర దర్శకులు…

Young Directors targeting Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉంటుంది. ప్రేక్షకులను పవన్ కళ్యాణ్ కి దగ్గర చేసిన అంశం కూడా అదే అంశం కావడం విశేషం.. ఇక ప్రస్తుతం తన అభిమానులు తన పేరు విన్న, విజువల్ కనిపించిన, ఆయన సినిమాలు రిలీజైన ఫ్యాన్స్ మాత్రం చొక్క చించుకొని మరి సినిమా థియేటర్లో సందడి చేస్తారు. అందుకే ఆయన సినిమాలు తక్కువగా చేసిన కూడా ఆయన క్రేజ్ అంతకంతకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా సమాజానికి సేవ చేస్తున్న ఆయన సినిమాల రూపంలో కూడా ఎంతో కొంత ప్రజలకు మెసేజ్ ఇచ్చి వాళ్లను ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలతో కూడా పెను ప్రభంజనాలను సృష్టించగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడానికి టాప్ డైరెక్టర్లతో పాటు కొంతమంది కుర్రదర్శకులు కూడా ఉత్సాహాన్ని చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.

వివేక్ ఆత్రేయ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ప్రస్తుతం ఉన్న బాలయ్య బాబుతో సినిమా చేస్తున్నాడనే వార్తలు వచ్చినప్పటికి హోల్డ్ లో పడింది. ఇక ఈ లోపు పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి సరిపడా కథ తన దగ్గర ఉండడంతో పవన్ కళ్యాణ్ కైతే కథను వినిపించారట.

Also Read: వివాదంలో చిక్కుకున్న వారణాసి మూవీ…క్లారిటీ ఇచ్చిన జక్కన్న…

మొత్తానికైతే వివేక్ ఆత్రేయ చెప్పిన కథ పవన్ కళ్యాణ్ ను ఇంప్రెస్ చేసినట్టుగా తెలుస్తోంది… ‘భీష్మ’ సినిమాతో సక్సెస్ ని సాధించిన వెంకీ కుడుముల సైతం పవన్ కళ్యాణ్ కోసం ఒక కథను సిద్ధం చేశారట. తొందరలోనే అతన్ని కలిసి ఆయనకు ఆ కథను వినిపించి ఎలాగైనా సరే ఫైనల్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…

మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోగలుగుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇలా కుర్ర దర్శకులందరు పవన్ కళ్యాణ్ వెంటపడుతుండటంతో పవన్ కళ్యాణ్ కి ఏం చేయాలో తెలియని ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉన్నాడట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version