Rajamouli Varanasi Movie Controversy: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా భారీ రేంజ్ లో తన పరిధిని విస్తరించుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ప్రపంచ స్థాయి ప్రేక్షకులందరిని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్న రాజమౌళి ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడం ఖాయం అంటూ పలు వార్తలైతే వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ అంతకంతకు పెరిగిపోతుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇక దీని మీద రాజమౌళి గాని, సినిమా యూనిట్ గాని ఎలాంటి స్పందనను తెలియజేయలేదు. కారణం ఏదైనా కూడా ఈ సినిమా విషయంలో వీళ్లు చాలా పకడ్బందీ ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…
ఇక బడ్జెట్ పెరుగుతూ ఉండడం వల్ల ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కొంతవరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. బడ్జెట్ పెరిగితే ఒక ప్రొడ్యూసర్ తోనే ఈ సినిమాని కొనసాగిస్తారా? లేదంటే మరో ప్రొడ్యూసర్ ని ఆడ్ చేసుకునే ప్రయత్నం చేస్తారా అనే విషయంలో సరైన క్లారిటి రావడం లేదు. మొత్తానికైతే రాజమౌళి ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలుపడానికి తీవ్రమైన కసరత్తులను చేస్తున్నాడు.
ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు కనుక లేకపోతే రాజమౌళి ఈ సినిమాకి మరో ప్రొడ్యూసర్ గా మారే ప్రయత్నం కూడా చేయబోతున్నారట. ఇక ఏదేమైనా కూడా రాజమౌళి కెరియర్ ను డిసైడ్ చేసే సినిమా అనే చెప్పాలి. ఎందుకంటే ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించాలంటే అంత ఆషామాషీగా ఉంటే సరిపోదు… స్క్రీన్ మీద చాలా పర్ఫెక్ట్ గా సినిమాను ప్రజెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది.
రాజమౌళి ఈ సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు సినిమా బడ్జెట్ విషయంలో గానీ మేకింగ్ విషయంలో గాని ఏదైనా ప్రాబ్లం వస్తే మొత్తం తనే చూసుకోవాలి అనుకుంటున్నాడా? అనే విషయాలు తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
