Bigg Boss 9 first captain Sanjana: ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) మంచి ఊపు మీద సాగుతుంది. ఇప్పటికే ఈ సీజన్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనే వైబ్స్ జనాలకు వచ్చేసింది. అయితే ఈ సీజన్ ఈ రేంజ్ లో వెళ్తుందంటే అందుకు కారణం సంజన గల్రాని(Sanjana Galrani). ఆమె హౌస్ లో తెలిసి చేస్తుందో, లేదా తెలియక చేస్తుందో తెలీదు కానీ, ఏమి చేసిన పెద్ద సమస్య అయిపోతుంది. హౌస్ మొత్తం గొడవపడేలా చేస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, హౌస్ నిప్పు పెట్టి, అది కాలిపోతుంటే అలా మూలాన కూర్చొని నవ్వుతున్నట్టుగా ఉంది సంజన తీరు చూస్తుంటే. ఆమె కారణం గానే ఈ సీజన్ ఆసక్తికరంగా సాగుతూ ముందుకు దూసుకుపోతుంది. గుడ్డు దొంగతనం చేసి హౌస్ మేట్స్ అందరి మధ్య చిచ్చు పెట్టిన ఆమెకు ఓనర్స్ రెండు రోజుల పాటు హౌస్ లోకి అడుగుపెట్టడానికి వీలు లేదని శిక్ష వేస్తారు.
నవ్వుతూనే ఆమె ఆ శిక్ష ని అంగీకరించింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ శిక్ష విధంచిన కాసేపటికే బిగ్ బాస్ ఆమెని హౌస్ లోపలున్న కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తాడు. ఆ రూమ్ లో ఏమి జరిగింది, ఏమిటి అనేది తెలియదు కానీ, ఈరోజు హౌస్ లో నిర్వహించిన కెప్టెన్సీ టాస్కుల్లో సంజన గెలిచి ఈ సీజన్ మొట్టమొదటి కెప్టెన్ గా నిల్చింది అట. ఆ ఓనర్స్ అయితే తనని లోపలకు రానివ్వకుండా చేశారో, అదే ఓనర్స్ నిద్రపోతున్న బెడ్ రూమ్స్ లో, లోపల స్పెషల్ గా ఉన్నటువంటి లగ్జరీ కెప్టెన్ రూమ్ లో ఉండే అవకాశాన్ని సంపాదించింది సంజన. ఇప్పుడు అంత పెద్ద ఇంటికి ఆమె కెప్టెన్ అయ్యి కూర్చుండి. టెనెంట్ గా ఉన్నప్పుడే అందరికీ చుక్కలు చూపించిన సంజన,ఇక ఇంటి కెప్టెన్ అయితే ఎన్ని అరాచకాలు సృష్టిస్తుందో చూడాలి. ఇది కదా అసలు సిసలు గేమ్ అంటే.
ఇప్పుడు ఆమె ఓనర్స్ గా ఉన్నవాళ్ళని టెనెంట్స్ ని చేయొచ్చు, టెనెంట్స్ గా ఉన్నవారిలో కొంతమందిని ఓనర్స్ ని చేయొచ్చు అనే పవర్ బిగ్ బాస్ ఆమె చేతుల్లో పెడితే ఎలా ఉంటుంది?, ఊహిస్తేనే మజా వస్తుంది కదూ, చూస్తుంటే ఈ సీజన్ మొత్తం సంజన చుట్టూనే తిరిగేలాగా అనిపిస్తుంది. ఇక కెప్టెన్సీ కంటెండర్స్ లిస్ట్ ఒకసారి కూస్తే సంజన, ఇమ్మానుయేల్, మాస్క్ మ్యాన్ హరీష్, శ్రేష్టి వర్మ మరియు డిమోన్ పవన్. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే సంజన కోసం శ్రీజా ఆడిందట, ఇమ్మానుయేల్ కోసం భరణి ఆడాడట, శ్రేష్టి వర్మ కోసమ్ రాము రాథోడ్, డిమోన్ పవన్ కోసం ప్రియా, మాస్క్ మ్యాన్ హరీష్ కోసం పవన్ కళ్యాణ్ ఆడారట. మరి వీళ్లకు ఎలాంటి టాస్క్ ఇచ్చారు ఏమిటి అనేది తెలియాలంటే రాత్రి వరకు ఆగాల్సిందే.