Ritika Nayak: ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పాటు చేసుకున్న ‘మిరాయ్'(Mirai Movie) చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ‘హనుమాన్’ వంటి భారీ హిట్ తర్వాత, తేజ సజ్జ నుండి వస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా పై అంచనాలు మొదటి నుండి బాగానే ఉండేవి. ఇక ఎప్పుడైతే ఈ సినిమా నుండి ప్రమోషనల్ కంటెంట్ ఒక్కొక్కటిగా రావడం మొదలు అయ్యిందో, అప్పటి నుండి ఆ అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. థియేటర్స్ లో కచ్చితంగా చూడదగిన సినిమానే అనే నమ్మకం కలిగించేలా చేసింది ఈ ట్రైలర్. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా రితిక నాయక్(Rithika Nayak) నటించింది. ఈమె గతం లో హాయ్ నాన్న చిత్రం లో ప్రధాన పాత్ర పోషించింది, అదే విధంగా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది.
రీసెంట్ గా ఆమె మిరాయ్ ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో, ఆ చిత్రం అనుభవాల గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘ఆకాశవనంలో అర్జున కళ్యాణం చిత్రం తర్వాత ఒక సరైన కథ కోసం ఎదురు చూస్తున్న రోజుల్లో కార్తీక్ ఘట్టమనేని ఈ మిరాయ్ కథని వినిపించాడు. కథ వింటున్నప్పుడు ఒక ప్రేక్షకురాలిగానే విన్నాను. ఈ చిత్రం లోని ఫాంటసీ, లవ్, అడ్వెంచర్ అన్ని తెగ నచ్చేసాయి. ఇందులో నేను హిమాలయాల్లో ఉండే ఒక సన్యాసిని క్యారక్టర్ చేస్తున్నాను. చాలా బలంగా ఉంటుంది. నా పాత్ర పేరు విభ’ అంటూ చెప్పుకొచ్చింది రితిక నాయక్. ఇక ఈ చిత్రంలో హీరో గా నటించిన తేజ సజ్జ గురించి, డైరెక్టర్ గా పని చేసిన కార్తీక్ ఘట్టమనేని గురించి ఆమె పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
ఆమె మాట్లాడుతూ ‘తేజ సజ్జ(Teja Sajja) చాలా మంచి అబ్బాయి. సినిమా కోసం అతను ఎంతకి అయినా తెగిస్తాడు, ఎవ్వరూ చెయ్యలేని రిస్కులు చేస్తాడు. అతని నుండి నేను చాలా నేర్చుకున్నాను. సెట్స్ లో నేను డైరెక్టర్ కార్తీక్ ని తమ్ముడు ని పిలిచేదానిని, నన్ను అతను అక్కా అని పిలిచేవాడు. నా పుట్టిన రోజు అక్టోబర్ 27 అయితే, కార్తీక్ పుట్టిన రోజు అక్టోబర్ 28. ఈ ఒక్క కారణం తోనే సంవత్సరం తో సంబంధం లేకుండా నేను అక్కని అయ్యాను, అతను నాకు తమ్ముడు అయ్యాడు’ అంటూ చెప్పుకొచ్చింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈమె వయస్సు హీరో తేజ సజ్జ కంటే ఎక్కువట. తేజ సజ్జ వయస్సు 30 సంవత్సరాలు కాగా, రితిక నాయక్ వయస్సు అక్షారాలా 31 ఏళ్ళు అట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.