https://oktelugu.com/

Ram Charan and Rajamouli : రాజమౌళి మహాభారతం లో రామ్ చరణ్ పాత్ర ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు…

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకుడు రాజమౌళి...

Written By:
  • Gopi
  • , Updated On : January 2, 2025 / 10:46 AM IST

    Ram charan , Rajamouli

    Follow us on

    Ram Charan and Rajamouli : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకుడు రాజమౌళి… ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సైతం ఇతనికి తిరుగు లేదనే చెప్పాలి. ప్రస్తుతం నెంబర్ వన్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు చేయబోయే సినిమాలతో పాన్ వరల్డ్ లో తన సత్తా చాటాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి…ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇకమీదట ఆయన చేయబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒకేత్తయితే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారనున్నాయి. ఇక ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాన్ వరల్డ్ లోకి తెలుగు సినిమాను తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక దీంతో పాటు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు అయిన ‘మహాభారతం ‘ సినిమాని కూడా సెట్స్ మీదకి తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు తెర మీదకి వస్తుంది అనే దాని మీద సరైన క్లారిటీ లేదు.

    కానీ ఈ సినిమాలో ఇండియాలో ఉన్న నటులందరూ నటులు నటించబోతున్నారని వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న పాన్ ఇండియాలో తన సత్తా చాటుకుంటూ ‘గ్లోబల్ స్టార్’ గా అవతరించిన రామ్ చరణ్ కూడా మహాభారతం సినిమాలో ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

    ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ అర్జునుడి పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. కానీ రాజమౌళి నుంచి స్పష్టమైన సమాచారం అయితే రాలేదు. కానీ ‘త్రిబుల్ ఆర్’ సినిమాలో క్లైమాక్స్ లో రామ్ చరణ్ అదిరిపోయే ఫైట్ సీన్స్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసిన ప్రతి ఒక్కరూ రామ్ చరణ్ రాముడిగా సెట్ అయ్యాడు అంటుంటే మరి కొంతమంది మాత్రం అర్జునుడిగా తన సత్తా చాటుకుంటున్నాడు అంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు. ఇక మొత్తానికైతే రాజమౌళి ఈ సినిమా ద్వారా అర్జునుడి క్యారెక్టర్ ను రామ్ చరణ్ కి ఇవ్వాలని ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది…

    ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాల పట్ల సరైన క్లారిటీ లేదు. కానీ మొత్తానికైతే మహాభారతం సినిమాలో రామ్ చరణ్ పాత్ర చాలా కీలకంగా మారబోతుందనే వార్తలైతే వస్తున్నాయి. ఇక అందరికి తెలిసి అర్జునుడి పాత్రలోనే ఆయన కనిపిస్తే బెటరని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండడం విశేషం…