https://oktelugu.com/

New Zealand VS Sri Lanka:  రెండు ఓటముల తర్వాత లంక ఘర్షణకు న్యూజిలాండ్ ఔట్

శ్రీలంక క్రికెట్‌ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఈ టూర్‌లో టెస్టులతోపాటు, వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లో జరిగే టెస్టు సిరీస్‌లో శ్రీలంక విజయంపైనే భారత్‌ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు అర్హత ఆధారపడి ఉంది. ప్రస్తుతం న్యూజిలాండ్, శ్రీలంక మధ్య టీ20 మ్యాచ్‌లు జరుగుతున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 2, 2025 / 11:07 AM IST

    New Zealand VS Sri Lanka 3rd T 20

    Follow us on

    New Zealand VS Sri Lanka: ఆసియా దేశం శ్రీలంక క్రికెట్‌ జట్టు, ఆస్ట్రేలియా దేశం న్యూజిల్యాండ్‌లో పర్యటిస్తోంది. ఈటూర్‌లో ఆతిథ్య జట్టుతో శ్రీలంక టీ20లు, వన్డేలు, టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రస్తుతం టీ20 సిరీస్‌ జరుగుతోంది. ఇందులో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగిశాయి. మూడో టీ20 జరిగింది. ఇందులో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.

    శ్రీలంక భారీ స్కోర్‌..
    ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్‌ గెలిచాయి. దీంతో సిరిసీలో 1–1తో సమంగా ఉన్నయి. ఈ మ్యాచ్‌ కీలకంగా మారింది. ఇందులో మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు నిసంక, మెండీస్‌ 40 పరుగుల భాగస్వామ్యం అంధించారు. ధాటిగా ఆడే క్రమంలో వికెట్లు కల్పోయారు. మూడోస్థానంలో వచ్చిన కుసల పెరారే ధాటిగా ఆడాడు. 46 బంతుల్లో 101 పరుగులు చేశాడు. దీంతో శ్రీలంక భారీ స్కోర్‌ సాధించింది. కెప్టెన్‌ అసలంక కూడా కీలక పరుగులు చేశాడు. 46 పరుగులతో జట్టు భారీ స్కోర్‌ సాధించేందుకు కృషి చేశారు. దీంతో 20 ఓవర్లలో శ్రీలంక ఐదు వికెట్ల కోల్పయి 218 పరుగులు చేసింది.

    పోరాడి ఓడిన న్యూజిలాండ్‌..
    ఇక 219 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు లక్ష్య ఛేదనకు కొద్ది దూరంలో ఆగిపోయింది. 211 పరుగులు మాత్రమే చేసి 7 పరుగులతో ఓడిపోయింది. న్యూజిలాండ్‌లో ఓపెనింగ్‌ జోడీ తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించడంతో న్యూజిలాండ్‌ భారీ స్కోరును ఛేదించడంలో శుభారంభం లభించింది. మిడిల్‌ ఆర్డర్‌ విఫలం కావడంతో పరుగులు మందగించాయి. మిచెల్‌ 35 పరుగులతో పోరాడినా అతనికి మద్దతు లభించలేదు. చివరకు టెయిలెండర్లు సాట్నర్, ఫుల్‌కేస్‌ గెలిపించే ప్రయత్నం చేశారు. కానీ, 211 పరుగులు మాత్రమే చేయగలిచారు. దీంతో న్యూజిలాండ్‌ 7 పరుగులతో ఓడిపోయింది. కివీస్‌ తరఫున రచిన్‌ రవీంద్ర 69 పరుగులతో టాప్‌ స్కోర్‌ చేయగా, డారిల్‌ మిచెల్‌ మరియు రాబిన్సన్‌ ఉపయోగకరమైన నాక్స్‌ ఆడారు, అయితే చివరికి అది సరిపోలేదు.

    శ్రీలంకకు జరిమానా..
    టీ 20 ఓవర్లను సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో శ్రీలంకకు పెనాల్టీ పడింది. అర్థం, ఒక అదనపు ఫీల్డర్‌ లోపలి రింగ్‌ లోపల ఉంచబడాలి, సర్కిల్‌ వెలుపల కేవలం 4 మంది మాత్రమే ఉంటారు.

    న్యూజిలాండ్‌ (ప్లేయింగ్‌ లెవన్‌): టిమ్‌ రాబిన్సన్, రచిన్‌ రవీంద్ర, మార్క్‌ చాప్‌మన్, గ్లెన్‌ ఫిలిప్స్, డారిల్‌ మిచెల్, మిచెల్‌ హే(ఠీ), మైఖేల్‌ బ్రేస్‌వెల్, మిచెల్‌ సాంట్నర్‌(సి), జాకరీ ఫౌల్క్సన్, మాట్‌ హెన్రీ, జాకబ్‌ డఫీ.

    శ్రీలంక (ప్లేయింగ్‌ లెవన్‌): పాతుమ్‌ నిస్సాంక, కుసల్‌ మెండిస్‌(ఠీ), కుసల్‌ పెరీరా, అవిష్క ఫెర్నాండో, చరిత్‌ అసలంక(సి), భానుక రాజపక్స, వనిందు హసరంగా, చమిందు విక్రమసింఘే, మహేశ్‌ తీక్షణ, బినుర ఫెర్నాండో, నువాన్‌ తుషార.