Gang Leader Movie: ఒక స్టోరీ రాసుకొని దాన్ని తెరమీదకి తీసుకు రావాలంటే ఒక దర్శకుడు ఎంత కష్టపడాల్సి ఉంటుందో సినిమాలు చూసే చాలామంది జనాలకి తెలియదు. ఒక రెండున్నర గంటల్లో సినిమా చూసేసి అది హిట్టా, ఫట్టా అని చెప్పేసే ప్రేక్షకులకి దాని వెనకాల ఆ దర్శకుడు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు అనేది మాత్రం కనిపించదు. ఇక డైరెక్టర్లు కూడా అల్టిమేట్ గా మన సినిమానే మాట్లాడుతుంది అనే ఒకే ఒక రీజన్ తో ఇండస్ట్రీలో చాలా మంది ముందుకు సాగుతూ ఉంటారు.
ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది దర్శకులు ఒకప్పుడు మంచి సినిమాలను తీసి హీరోలను స్టార్ హీరోలుగా మార్చడంలో చాలా కీలకపాత్ర వహించారు. ఇక ఇది ఇలా ఉంటే ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో విజయ బాపినీడు చిరంజీవి ఎంటైర్ కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుని ఇవ్వడమే కాకుండా కమర్షియల్ సినిమా స్టాండర్డ్ ని కూడా సెట్ చేసి పెట్టాడనే చెప్పాలి. ఇక ఇప్పటికీ ఒక కమర్షియల్ సినిమా ఎలా ఉండాలి అనే ప్రశ్న వచ్చిన ప్రతిసారి గ్యాంగ్ లీడర్ సినిమాని ఉదాహరణకు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ సినిమాలో వాడిన డైలాగులు గాని, చిరంజీవి చేసిన డ్యాన్సులు గాని, ఆ స్టోరీ గానీ అంతా చాలా పకడ్బందీగా ఉంటుంది.
అలాగే కమర్షియల్ ఫార్మాట్ ప్రకారం ఎక్కడ హైప్ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనేది కూడా మీటర్ మీద రాసుకున్నట్టుగా ఉంటుంది. అందుకే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది. అయితే ఇంత పెద్ద సక్సెస్ అయిన ఈ సినిమాకి మూల కథను అందించింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. అయితే ఈ సినిమాకి మూల కథ అందించింది. మెగాస్టార్ చిరంజీవి… ఒక రోజు ఆయన విజయ బాపినీడు తో ఒక ఫ్యామిలీ సినిమా చేద్దాం అని చెప్పి, ఒక ఫ్యామిలీలో ముగ్గురు అన్నయ్యలు ఉంటారు.
అందులో పెద్ద అన్నయ్య కొంతమంది చంపేస్తే, వాళ్ళని చంపడం కోసం హీరో తిరుగుతూ రివెంజ్ తీర్చుకునే స్టోరీ చేస్తే ఎలా ఉంటుంది అని విజయ బాపినీడు తో చెప్పి అతని చేత ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్ కంప్లీట్ చేయించి సూపర్ డూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమాతో ఇద్దరు మంచి విజయాన్ని సాధించారు.