https://oktelugu.com/

Chiranjeevi : ఆ విషయంలో చిరంజీవికి ధైర్యం ఇచ్చిన అల్లు అర్జున్…

ఇక మొత్తానికైతే రామ్ చరణ్ టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లో కూడా తన సత్తా చాటుతూ గ్లోబల్ స్టార్ గా కూడా ఎదగడం అనేది మెగా అభిమానులను ఆనందానికి గురి చేస్తుందనే చెప్పాలి...ఇక ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా చేస్తూనే బుచ్చిబాబు డైరెక్షన్ లో మరో కొత్త సినిమా కూడా చేస్తున్నాడు...

Written By:
  • NARESH
  • , Updated On : March 25, 2024 / 08:56 AM IST

    Allu Arjun gave courage to Chiranjeevi...

    Follow us on

    Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్లకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే దాదాపు 40 సంవత్సరాలు గా ఇండస్ట్రీ ని షేక్ చేస్తూ వస్తున్న ఒకే ఒక హీరో మెగాస్టార్ చిరంజీవి…ఈయన చేసిన ప్రతి సినిమా వైవిద్యమైన కథాంశంతో తెరకెక్కడమే కాకుండా సూపర్ డూపర్ సక్సెస్ లని అందుకోవడంలో కీలకపాత్ర వహించాయనే చెప్పాలి.

    ఇక ఇదిలా ఉంటే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఈయన విశ్వంభర లాంటి సినిమాని చేస్తూ తన ఖాతాలో భారీ సక్సెస్ ను వేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి అందులో భాగంగానే ఆయన చేస్తున్న ఈ సినిమా భారీ సక్సెస్ ను సాదిస్తుందని సినిమా యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి కొడుకు అయిన రామ్ చరణ్ తన చిన్నతనం నుంచే చాలా ఇంట్రోవర్టుగా ఉండేవాడు. ఇక వాళ్ళింట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినపుడు కూడా యాక్టివ్ గా డాన్స్ చేయడానికి కూడా తను ముందుకొచ్చి చేసేవాడు కాదట.

    ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ హీరోగా మారుతున్న సమయంలో చిరంజీవి అల్లు అర్జున్ తో చరణ్ కి చాలా మొహమాటం ఎక్కువగా ఉంటుంది. ఎవరితో ఎక్కువగా మాట్లాడడు, అలాంటిది సినిమాల్లో డాన్స్ లు, ఫైట్లు బాగా చేస్తాడా లేదా అని అల్లు అర్జున్ తో చిరంజీవి అనేవాడట. దానికి అల్లు అర్జున్ మాత్రం అదేం లేదు చరణ్ కుమ్మెస్తాడు. నువ్వేం ఇబ్బంది పడకు అని చిరంజీవికి ధైర్యాన్నిచ్చాడట. ఇక బన్ని చెప్పిన మాటలకు చిరంజీవి కూడా చాలా ధైర్యంగా ఫీల్ అయ్యారట…

    ఇక మొత్తానికైతే రామ్ చరణ్ టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లో కూడా తన సత్తా చాటుతూ గ్లోబల్ స్టార్ గా కూడా ఎదగడం అనేది మెగా అభిమానులను ఆనందానికి గురి చేస్తుందనే చెప్పాలి…ఇక ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా చేస్తూనే బుచ్చిబాబు డైరెక్షన్ లో మరో కొత్త సినిమా కూడా చేస్తున్నాడు…