సోషల్ మీడియాలో వాట్సాప్ ఒక వండర్ అని చెప్పాలి. మెస్సేజ్ కోసం.. సమాచారం చేరవేసేందుకు ఒకప్పుడు మెయిల్స్ వాడేవారం. కానీ.. వాట్సాప్ వచ్చాక అందరికీ ఈజీ అయిపోయింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు దీనిని వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉందా.. అందులో వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసేస్తున్నారు. వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ వినియోగదారులను మరింత ఆకట్టుకుంటోంది. కొత్త కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తెస్తూ సాటి ఎవరూ లేరని నిరూపిస్తోంది. ఇండియాలో మిలియన్ల మంది యూజర్లు ఉన్న […]
సోషల్ మీడియాలో వాట్సాప్ ఒక వండర్ అని చెప్పాలి. మెస్సేజ్ కోసం.. సమాచారం చేరవేసేందుకు ఒకప్పుడు మెయిల్స్ వాడేవారం. కానీ.. వాట్సాప్ వచ్చాక అందరికీ ఈజీ అయిపోయింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు దీనిని వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉందా.. అందులో వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసేస్తున్నారు. వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ వినియోగదారులను మరింత ఆకట్టుకుంటోంది. కొత్త కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తెస్తూ సాటి ఎవరూ లేరని నిరూపిస్తోంది.
ఇండియాలో మిలియన్ల మంది యూజర్లు ఉన్న వాట్సాప్ కొత్త ఫీచర్లలో భాగంగా Vacation mode, new UIని అందుబాటులోకి తెస్తోంది. వీటిలో యానిమేటెడ్ స్టిక్కర్స్, QR కోడ్స్ కూడా ఉన్నాయి. ఇంతకీ ఆ ఫీచర్లు ఏంటి.. అవి ఎలా ఉపయోగపడుతాయో ఒకసారి తెలుసుకుందాం.
Vacation Mode: ఇది వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఫీచర్ అని చెప్పచ్చు. ఈ ఫీచర్‌తో ఇదివరకు చాట్ చేసిన మెసేజ్‌లను అదే Archived చాట్ మెసేజ్‌లను మ్యూట్ చేస్తుంది. చాట్‌కు సంబంధించి Archived చేసిన వాటిలో కొత్త మెసేజ్‌లు వచ్చినప్పటికీ మ్యూట్‌లో ఉంచుతుంది. ఒకవేళ ఏదైనా ఒక చాట్.. వ్యక్తిగత చాట్ లేదా గ్రూపు చాట్‌లో కొత్త మెసేజ్ రాగానే వెంటనే మీకో పాప్ అప్ వస్తుంది. కొత్త మెసేజ్‌లు మాత్రం టాప్‌లో కనిపిస్తాయి.*New WhatsApp Wallpapers:
వాట్సాప్ అందించే డీఫాల్ట్ వాల్ పేపర్లు ఇప్పటివరకు మనం వాడుతున్నాం. లేదంటే గ్యాలరీ నుంచి ఏదేని ఫొటోలు పెడుతుంటాం. అయితే.. వాట్సాప్ వాల్ పేపర్లనే బ్యాక్ గ్రౌండ్‌లో వాడే వారికి ఇది గుడ్‌న్యూస్. ఈ ఫీచర్ ద్వారా ఒక్కో చాట్ బాక్సులో వేర్వేరు బ్యాక్ గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ స్టేజీలో ఉంది. రెగ్యులర్ లేదా బీటా యూజర్లుకు కూడా అందుబాటులో లేదు. త్వరాలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
* Storage Section redesign, Call UI:
వాట్సాప్ అకౌంట్లో నిత్యం Storage Usage Section చూస్తూనే ఉంటాం. దీన్ని వాట్సాప్ సరికొత్తగా రూపొందిస్తోంది. కొత్త డిస్‌ప్లే రాబోతోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు తమ స్టోరేజీని సులభంగా వినియోగించుకోవచ్చు. ఫోన్ స్టోరేజీలో తిష్టవేసిన అవసరం లేని చెత్త ఫైళ్లను డిలీట్ చేసుకోవచ్చు. WABetaInfo ప్రకారం.. వాట్సాప్ UI కాల్ స్క్రీన్‌లో కింది భాగంలోకి ఎలిమెంట్స్ మూవ్ చేస్తుంది. అతి త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి తేవడానికి వాట్సాప్ ప్రయత్నిస్తోంది.
* New Sticker Animations:
వాట్సాప్ ఇటీవలే యానిమేటెడ్ స్టిక్కర్స్ ఫీచర్ తెచ్చింది. ఇప్పుడు దీనికి కొత్త యానిమేషన్ టైప్ తీసుకొస్తోంది. యానిమేటెడ్ స్టిక్కర్లను యాడ్ చేస్తోంది. ఒకసారి ఈ యానిమేటెడ్ స్టిక్కర్లను చాట్ బాక్సులోకి పంపిస్తే 8సార్లు లూప్ అవుతాయి. స్టిక్కర్ స్టోర్‌లో కొత్త స్టిక్కర్ ప్యాక్ అనే మోడ్ కూడా రాబోతోంది. నచ్చిన యానిమేటెడ్ స్టిక్కర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.