YEAR ENDER 2024: సినిమా ఏదైనా హిట్ అయితే దానికి మళ్లీ ఇంకో సీక్వెల్ తీయడం ఈ మధ్య ఒక ట్రెండ్ అయిపోయింది. బాలీవుడ్, టాలీవుడ్ అనే లేకుండా ఈ సీక్వెల్ ట్రెండ్ కొనసాగుతోంది. అయితే 2024లో కొన్ని సీక్వెల్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని హిట్ అయితే మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈ ఏడాది మరి టాలీవుడ్‌లో సీక్వెల్‌గా వచ్చిన ఆ సినిమాలు ఏంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
మత్తు వదలరా 2
మత్తు వదలరా పార్ట్ వన్ ఇంతకు ముందు రిలీజ్ కాగా.. ఈ ఏడాది మత్తు వదలరా 2 రిలీజ్ అయ్యింది. సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహ గతంలో మత్తు వదలరా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పార్ట్ 1 హిట్ కావడంతో దీనికి సీక్వెల్‌గా ఈ ఏడాది విడుదల చేశారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ సినిమా సీక్వెల్‌ను రిలీజ్ చేశారు. రితీష్ రానా దర్శకత్వం వహించగా ముఖ్యపాత్రల్లో శ్రీ సింహ, సత్య, ఫరియా అబ్దుల్లా నటించారు. ఎలాంటి అంచనాలు లేకపోయిన కూడా కామెడీ ఎంటర్‌టైనర్‌గ ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
డీజే టిల్లు
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా ఈ ఏడాది టిల్లు స్క్వేర్ వచ్చింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా లిల్లీ పాత్రలో నటించింది. ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే టిల్లు స్క్వేర్ కూడా హిట్ కావడంతో డీజే టిల్లు 3 కూడా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
డబుల్ ఇస్మార్ట్
డైరెక్టర్ పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో ఇస్మార్ట్ శంకర్ గతంలో వచ్చింది. ఈ సినిమా హిట్ కావడంతో దీనికి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్‌ను ఈ ఏడాది విడుదల చేశారు. కానీ ఆశించినంత స్థాయిలో హిట్ కాలేదు.
ప్రతినిధి 2
పాత్రికేయుడు మూర్తి తెరకెక్కించిన ప్రతినిధి 2 సినిమా ఈ ఏడాది ప్రతినిధికి సీక్వెల్‌గా వచ్చింది. ఇందులో రానా రోహిత్ హీరోగా నటించారు. ఈ సినిమా కూడా పెద్దగా హిట్ కాలేదు.
పుష్ప 2
డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో గతంలో పుష్ప వచ్చింది. ఈ సినిమా భారీ హిట్ కావడంతో సీక్వెల్‌గా పుష్ప 2ని ఇటీవల విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా రికార్డులను సృష్టించింది. ఎన్నడూ లేని విధంగా భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటించగా రష్మిక మందాన హీరోయిన్‌గా మెప్పించింది. ఇవే కాకుండా ఈ ఏడాది భామ కలాపం 2, గీతాంజలి 2, యాత్ర 2 వంటి సినిమాలు కూడా సీక్వెల్‌గా వచ్చాయి. కానీ ఇవన్నీ ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చాయి.