YEAR ENDER 2024: ఏ కంపెనీలు అయిన లాభనష్టాలు సాధారణమే. అయితే కొన్ని కంపెనీలు ఎక్కువ లాభాలు అందుకుంటే మరికొన్ని కంపెనీలు నష్టాలను అందుకుంటాయి. ఈ ఏడాది చాలా కంపెనీలు లాభాల కంటే నష్టాలే ఎదుర్కొన్నాయి. కేవలం దేశీయ మార్కెట్‌లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లోనూ నష్టాలను చవి చూశాయి. చిన్న కంపెనీ, పెద్ద కంపెనీ అని తేడా లేకుండా నష్టాల బాట పట్టాయి. కేవలం ఒక రంగం అనే కాకుండా టెలికాం, ఐటి, ఆటోమొబైల్, ఇంధన రంగాలు ఇలా అన్ని రంగాల్లోని కంపెనీలు నష్టాలను చవి చూశాయి. మరి ఈ ఏడాది ఎక్కువగా నష్టాలు చూసిన టాప్ కంపెనీలు ఏవో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
భారతీ ఎయిర్‌టెల్
దేశంలో టెలికాం రంగంలో భారతీ ఎయిర్‌టెల్ పెద్ద కంపెనీ. ఈ ఏడాది మొదట్లోనే రూ. 10,000 కోట్ల నష్టాన్ని కంపెనీ చవి చూసింది. దీనికి ముఖ్య కారణం ఇతర టెలికాం కంపెనీల నుంచి గట్టి పోటీ ఉండటం వల్ల నష్టాల బాట పట్టాయి. అలాగే టారిఫ్ తగ్గింపులు, నెట్‌వర్క్ రీప్లేస్‌మెంట్ వంటివి కూడా పెంచాయి. దీంతో వినియోగదారుల సంఖ్య తగ్గిపోవడంతో కంపెనీకి భారీగా నష్టాలు వచ్చాయి.
టాటా మోటర్స్
ఈ ఏడాది టాటా మోటర్స్ బాగానే వ్యాపారం చేసింది. అయిన కూడా కంపెనీ రూ. 5,000 కోట్లు నష్టపోయినట్లు ప్రకటించింది. ఈ ఏడాదిలో ఎక్కువగా ఆటో మొబైల్ పోటీ ఉండటం వల్ల కార్లకు బాగా డిమాండ్ తగ్గింది. దీనికి తోడు కొత్త మోడళ్లు మార్కెట్‌లోకి రాకపోవడం వల్ల నష్టాలను చవిచూసింది.
ఓఎన్‌జీసీ
ఓఎన్‌జీసీ దేశంలోని అతిపెద్ద ఆయిల్ గ్యాస్ సంస్థ. ఈ ఏడాదిలో ఈ సంస్థ రూ. 8,000 కోట్ల నష్టపోయినట్లు ప్రకటించింది. అయితే దీనికి ముఖ్య కారణం క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నా కూడా వాటి విలువ ప్రపంచంలో తగ్గడం వల్ల నష్ట పోయినట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని ఆయిల్ ఫీల్డ్‌లు పని చేయకపోవడం కూడా ఓ కారణమే.
ఇన్ఫోసిస్
దేశంలో ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ రూ. 3,500 కోట్లు నష్టాన్ని చవిచూసింది. దీనికి ముఖ్య కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో వ్యయం తక్కువగా ఉండటం, కొత్త ప్రాజెక్టులను వాయిదా వేయడం వంటి కారణాల వల్ల నష్టపోయినట్లు తెలుస్తోంది.
హోండా మోటార్స్ & సైకిల్స్
ఈ ఏడాదిలో హోండా మోటార్స్ భారీగా నష్టపోయింది. మొత్తం మీద రూ.2,500 కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే కొత్త కంపెనీలు మార్కెట్‌లోకి రావడం వల్ల హెండాకి కాస్త నష్టం వాటిల్లింది. అలాగే డిమాండ్ వల్ల కాస్త ఉత్పత్తి స్థాయి తగ్గింది. దీంతో కంపెనీకి భారీ నష్టం వాటిల్లింది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.