Year 2024: ఏవైనా విషయాలు తెలుసుకోవడానికి గూగుల్‌లో సెర్చ్ చేస్తూనే ఉంటాం. కేవలం మనమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఒక విషయం గురించి రోజూ అందరూ సెర్చ్ చేస్తూనే ఉంటారు. మనకి ఏదైనా చిన్న సందేహం వస్తే చాలు.. ఒక్క క్షణం ఆలోచించకుండా వెంటనే గూగుల్‌ను ఆశ్రయిస్తాం. కనీసం పక్కన ఎవరు ఉన్నా కూడా వారిని అడగం. దీనికి ముఖ్య కారణం గూగుల్ అయితే అసలు తప్పు చెప్పకుండా కరెక్ట్ చెబుతాదని ఉద్దేశించి నమ్మకంతో చెక్ చేస్తారు. అయితే గూగుల్ ప్రతీ ఏడాది ఎక్కువగా ఏ విషయాలు సెర్చ్ చేశారో విడుదల చేస్తుంది. ఈ ఏడాది మరో మూడు రోజుల్లో పూర్తి కావస్తుంది. ఈ క్రమంలో 2024లో ఎక్కువగా గూగుల్‌లో ఏ హీరోయిన్ గురించి సెర్చ్ చేశారనే విషయాన్ని తెలిపింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హీరోయిన్ త్రిప్తీ డిమ్రి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. యానిమల్ సినిమాతో ఒక్క రోజుకే నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఎవరూ ఊహించని పాత్రలో నటించిన త్రిప్తీ డిమ్రీ.. ఈ ఒక్క సినిమాతో గుర్తింపు సంపాదించుకుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కూడా రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో వచ్చింది. డిసెంబర్‌లో ఈ సినిమా విడుదల కావడంతో ఈమె గురించి నెటిజన్లు ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్ చేశారు. యానిమల్ తర్వాత వరుస ఆఫర్లు వచ్చాయని, ఇంకా వేరే సినిమాలో కూడా నటించబోతుందని వార్తలు రావడంతో ఈమె అప్‌డేట్‌ల కోసం నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేశారు. ఈ ఏడాది బ్యాడ్ బాయ్‌జ్, భూల్ భూలయ్య వంటి సినిమాల్లో నటించడంతో ఈమెను సెర్చ్ చేశారు. అందరి హీరోయిన్లను పక్కన పెట్టి మరి ఈమెను గూగుల్‌లో నెటిజన్లు సెర్చ్ చేశారంటే అర్థం చేసుకోవాల్సిందే.
ఇంతకు ముందు త్రిప్తి ఎన్ని సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ యానిమల్ సినిమాతో తాను ఊహించలేనంత గుర్తింపు వచ్చింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇంతకు ముందు ఏడాదికి ఒక సినిమా చేసే త్రిప్తి వరుస సినిమా ఆఫర్లతో ప్రస్తుతం బిజీగా ఉంటోంది. ఇటీవల ఓ సినిమాకి కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వస్తున్న సినిమాకి త్రిప్తీ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ హీరోగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతోనే ఫహాద్ బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా వరుస ఆఫర్లతో ప్రస్తుతం బిజీ హీరోయిన్‌గా త్రిప్తి మారిపోయింది.