https://oktelugu.com/

Chiranjeevi : చిరంజీవి గీతా ఆర్ట్స్ లో సినిమా చేయకపోవడానికి రామ్ చరణ్ కారణమనే విషయం మీకు తెలుసా..?

ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సక్సెస్ ఫుల్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకున్నప్పటికి మెగాస్టార్ చిరంజీవి రేంజ్ ను టచ్ చేసే హీరోలు మాత్రం రాలేదనే చెప్పాలి. తన డాన్స్ ని మ్యాచ్ చేసే హీరోగాని, అతని స్టైల్ ని ఢీకొట్టే హీరో ఇప్పటివరకు ఎక్కడ తారసపడలేదు...అందుకే ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు మెగాస్టార్ గానే కొనసాగుతున్నాడు. ఇక ఇప్పుడు పాన్ ఇండియాలో తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : December 29, 2024 / 07:00 PM IST

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించాయి. దాదాపు 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న ఏకైక హీరో కూడా మెగాస్టార్ చిరంజీవి గారే కావడం విశేషం… ఇక ప్రస్తుతం యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్న ఈ స్టార్ హీరో 70 సంవత్సరాల వయసులో కూడా భారీ సినిమాలు చేస్తూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇక మీదట చిరంజీవి చేయబోయే సినిమాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా వింటేజ్ చిరంజీవిని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన చిరంజీవి లుక్ పోస్టర్లను కనుక మనం చూసినట్లయితే గ్యాంగ్ లీడర్ సమయంలో ఆయన ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాంటి ఒక లుక్ లో కనిపించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

    ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ చిరంజీవి తన కెరియర్ మొదట్లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చాలా ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చాడు. చిరంజీవి వల్లే అల్లు అరవింద్ భారీ ప్రొడ్యూసర్ గా కూడా అవతరించాడనే విషయం మనందరికీ తెలిసిందే.

    మరి ఇప్పుడు మాత్రం ఆయన గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమాలు చేయడం లేదు. కారణం ఏదైనా కూడా వీళ్ళ మధ్య కొంతవరకు విభేదాలు అయితే ఉన్నాయనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో వీళ్ళంతా కలిసిపోయి అతన్ని బయటికి తీసుకు రావడానికి చాలా విధాలుగా ప్రయత్నమైతే చేసి మొత్తానికైతే బెయిల్ సంపాదించారు…ఇక వీళ్లంతా కలిసిపోయారని అందరూ అనుకుంటున్నా కూడా చిరంజీవి మాత్రం గీతా ఆర్ట్స్ లో సినిమా చేయడం లేదట.

    కారణం ఏంటంటే అల్లు అరవింద్ మగధీర సినిమా సమయంలో ఆ సినిమాని బాలీవుడ్ లో డబ్ చేసి రిలీజ్ చేద్దాం అని చిరంజీవి చెప్పినప్పటికి అతను వినలేదట. అప్పటి నుంచే చిరంజీవి వాళ్ళ బ్యానర్ లో సినిమా చేయకూడదని నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా మెగాస్టార్ చిరంజీవి చేసే సినిమాలకు ప్రేక్షకుల్లో చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…