Kodama Simham movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న మోహన్ బాబు తనదైన రీతిలో సినిమాలు చేస్తూ మంచి ఇమేజ్ ను కూడా సంపాదించి పెట్టుకున్నాడు. చాలామంది అభిమానులను సంపాదించుకున్న ఈ నటుడు తన ఎంటైర్ కెరియర్ లో 500కు పైన సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపును కూడా తెచ్చుకున్నాడు. మరి ఏది ఏమైనా కూడా మోహన్ బాబు లాంటి విలక్షణమైన నటుడు ఇండస్ట్రీలో మరొకరు ఉండరు అనేది వాస్తవం…ఆయన చేసిన ప్రతీ క్యారెక్టర్ కూడా తనకు మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా ఆయన మీద ఉన్న గౌరవాన్ని పెంచుతూ వచ్చాయి. ఇక ఆయన ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో రీసెంట్ గా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ అయితే పెట్టారు. చిరంజీవి హీరోగా వచ్చిన ‘కొదమ సింహం’ సినిమా గురించి ఆయన రీసెంట్ గా ఒక పోస్ట్ ని పెట్టారు. ఈ సినిమాకి సంబంధించిన వీడియో ని కూడా రిలీజ్ చేశారు. కొదమ సింహం సినిమాలో తను పోషించిన ‘సుడిగాలి ‘ పాత్ర తనకు చాలా పేరు తీసుకొచ్చిందని అందులో తను వాడిన మేనరిజం ‘డింగో డింగ్’ అనేది ఇప్పటికి చాలా ఫేమస్ అని రాసుకచ్చాడు.
ఇక ఈ సినిమాలకు రచయితలుగా పనిచేసిన పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ గారికి కృతజ్ఞతలు తెలియజేశాడు. అలాగే ఈ సినిమా దర్శకుడు ఆయన కే మురళీమోహన్ రావు గారికి కూడా తన కృతజ్ఞతలు తెలియజేయడం విశేషం. మరి మొత్తానికైతే ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఈ సినిమాలో హీరోగా చేసిన చిరంజీవి గురించి మాత్రమే ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు.
ఇక కారణం ఏదైనా కూడా కూడా చిరంజీవి గురించి కూడా ఒక మాట రాస్తే బాగుండేది అని మెగా ఫ్యామిలీ అభిమానులందరు కోరుకుంటున్నారు. మరి మోహన్ బాబుకు చిరంజీవికి మధ్య ఎప్పుడు వివాదాలైతే ఉంటూనే వస్తున్నాయనే విషయం మనకు తెలిసిందే. వీళ్ళ మధ్య టామ్ అండ్ జెర్రీ వార్స్ జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు కలిసి ఉంటారో ఎప్పుడు గొడవ పెట్టుకుంటారో వాళ్లకే తెలియాలి అంటూ కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక మొత్తానికైతే మోహన్ బాబు ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి కావడం అనేది మామూలు విషయం కాదు.
ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన తన కొడుకుల వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నప్పటికి మోహన్ బాబు అంటే ఇష్టపడే అభిమానులు ఇప్పటికి ఉండడం విశేషం… ఇకాంచు విష్ణు హీరో గా చేస్తున్న కన్నప్ప సినిమాలో కూడా ‘మహాదేవ శాస్త్రి’ అనే క్యారెక్టర్ లో తను నటించి మెప్పించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది…
Kodama Simham (1990): An action-adventure drama directed by Sri. K. Murali Mohana Rao and written by Sri. Paruchuri Brothers and Satyanand. ✨
Bringing the comedic villain 'Sudigali' to life was pure joy, and the memorable dialogue "Dingoo Dingu" still echoes with fans!✨… pic.twitter.com/vuDRf2FaV0
— Mohan Babu M (@themohanbabu) December 29, 2024