YCP : ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి వరుస కష్టాలు తప్పడం లేదు. ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. తాజాగా కదిరి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీని సైతం తెలుగుదేశం పార్టీ ఎగురవేసుకొని వెళ్ళింది. తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక మాత్రం వాయిదా పడింది. విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ సైతం వాయిదా పడడం విశేషం. అయితే 2021 మున్సిపల్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయం సాధించింది. కనీసం తెలుగుదేశం పార్టీ ఉనికి చాటుకోలేకపోయింది. అయితే తాజాగా ఏపీలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. అధికార టిడిపి స్పష్టమైన ఉనికి చాటుతోంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి తన సత్తా చాటుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటించిన చోట మాత్రం ఎన్నిక వాయిదా పడింది. మిగతా చోట్ల టిడిపి కూటమి తన ఉనికి చాటుకొని మున్సిపాలిటీలను తన వశం చేసుకుంది.
Also Read : వై నాట్ కుప్పం.. ఆ స్లోగన్ ఇప్పుడు రివర్స్!
* కదిరిలో మారిన అధికారం..
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలకు( municipalities) సంబంధించి ఉప ఎన్నిక జరిగింది. శ్రీ సత్య సాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీని టిడిపి తన ఖాతాలో చేర్చుకుంది. మునిసిపల్ చైర్ పర్సన్ గా దిల్సా దున్నిషా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా సుధారాణి తో పాటు రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో టీడీపీ కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మరోవైపు ఎన్నికను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. ఇందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా బలం ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి కూటమి విజయంతో అధికారం తారుమారు అయ్యింది.
* బొబ్బిలి మున్సిపాలిటీ టిడిపి కైవసం..
మరోవైపు విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ( Bobbili ) టిడిపి వశం అయ్యింది. చైర్మన్గా టిడిపికి చెందిన శరత్ బాబు ఎన్నికయ్యారు. గత నెల 29న చైర్మన్ మురళీకృష్ణ రావు పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ అవిశ్వాసం తీర్మానం నెగ్గడంతో మురళీకృష్ణ రావు పదవి కోల్పోయారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈరోజు జరిగిన ఎన్నికల్లో 20 మంది సభ్యుల మద్దతుతో బొబ్బిలి మున్సిపాలిటీ టిడిపి ఖాతాలో చేరింది. మరోవైపు తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. వారం లేకపోవడంతో మంగళవారానికి ఎన్నిక వాయిదా వేశారు. 20 మంది సభ్యులకు గాను ఏడుగురు మాత్రమే హాజరు కావడంతో వాయిదా వేస్తూ ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకున్నారు.
Also Read : ఆ బెదిరింపు ప్రకటనలతో వైసిపికే నష్టం!
* రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా..
మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి( ramagiri) ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే రెండుసార్లు నోటిఫికేషన్ ఇవ్వగా వారం లేకపోవడంతో వాయిదా పడింది. ముచ్చటగా మూడోసారి కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరు కావడంతో ఎన్నిక వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు గ్రే టర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా వాయిదా పడింది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ పై అవిశ్వాసం నెగ్గింది. టిడిపి నేత మేయర్గా ఎన్నికయ్యారు. కానీ డిప్యూటీ మేయర్ విషయంలో కూటమి పార్టీల మధ్య ఆకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక వాయిదా పడినట్లు తెలుస్తోంది