Homeఆంధ్రప్రదేశ్‌YCP: ఆ బెదిరింపు ప్రకటనలతో వైసిపికే నష్టం!

YCP: ఆ బెదిరింపు ప్రకటనలతో వైసిపికే నష్టం!

YCP: వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress) అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తాజాగా ఆయన చేస్తున్న ప్రకటనలు ప్రజల్లో ఒక రకమైన ఆందోళనకు గురిచేస్తున్నాయి. మళ్లీ మేము వస్తే అనే మాట ఇప్పుడు ఆయన నోటి నుంచి తరచూ వినిపిస్తోంది. కూటమి తమ పార్టీ నేతలను కేసులతో ఇబ్బంది పెడుతోందని.. తప్పుడు కేసులు పెట్టే అధికారులతో పాటు నేతల పని పడతామని జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. అయితే అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు అని తెలుస్తోంది. కానీ ఓ సెక్షన్ ప్రజల్లో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఏహ్య భావం ఏర్పడుతోంది. దానిని గుర్తించాల్సిన అవసరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై ఉంది. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. అయినా సరే ఆ పార్టీకి 40 శాతం ఓటు బ్యాంకు లభించింది. మిగతా 60 శాతం వైసీపీకి వ్యతిరేకులు అని భావించాలి. కానీ తన సంప్రదాయ ఓటు బ్యాంకు ఉందని భావించి.. జగన్మోహన్ రెడ్డి దూకుడు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: 3 ఏళ్లలోనే తిరుగుముఖం..ఎర్టిగాకు పోటీ ఇవ్వలేకపోయిన కియా

* ఆ రెండు వర్గాలు దూరం..
మొన్నటి ఎన్నికల్లో తటస్తులు, విద్యావంతులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారు. కేవలం జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) అభివృద్ధిని మరిచారని కొందరు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల దూకుడుతో విసిగిపోయిన మరికొందరు.. ఇలా రకరకాల కారణాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో కొందరి నేతల భాష, వ్యవహార శైలి పై అభ్యంతరాలు ఉన్నాయి. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేశారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దీనికి కారణం వైసీపీ నేతల భాష, వ్యవహార శైలి కారణం.

* భయం పెంచుతున్న ప్రకటనలు..
అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము వస్తే అని ప్రకటనలు చేస్తున్నారు. ఈ ప్రకటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఇప్పటికీ భయాన్ని పెంచుతున్నాయి. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వన్ చాన్స్ అని పిలుపునిచ్చారు. ఒక్క అవకాశం ఇవ్వండి అని కోరారు. ప్రజలు అవకాశం ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేశారు. అయినా సరే ఆయన ఓటమి చవిచూశారు. అందుకు కారణం అభివృద్ధి లేకపోవడం ప్రధానం అయితే.. జగన్మోహన్ రెడ్డి నుంచి నేతల వరకు చేసిన ప్రకటనలు.. వైసిపి పాలనలో జరిగిన వ్యవహారాలు వంటివి కీలక భూమిక పోషించాయి. ఇప్పుడు ప్రజలకు మరో ఛాన్స్ అని అడిగే అవకాశం లేదు. అలాగని మేము వస్తే అని బెదిరింపులకు దిగితే తన సంప్రదాయ ఓటు బ్యాంకు తోపాటు వైసీపీ శ్రేణులకు నచ్చవచ్చు. కానీ తటస్తులు, చదువుకున్న వారిలో మాత్రం ఆందోళన పెరుగుతుందన్న విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గ్రహించాలి.

* కూటమి వైఫల్యాలను ఎండగట్టవచ్చు కదా..
వైసిపి క్యాడర్ను( YSR Congress cadre ) కాపాడుకునేందుకు, వారిలో ధైర్యం నింపేందుకు జగన్మోహన్ రెడ్డి ఆ తరహా ప్రకటనలు చేయడంలో తప్పులేదు. దానిని ఎవరు తప్పు పట్టనవసరం లేదు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టవచ్చు. సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీయవచ్చు. ప్రజా సమస్యలను ప్రస్తావించవచ్చు. కానీ మేము మరోసారి అధికారంలోకి వస్తే అన్నమాట మాత్రం పార్టీ నాయకుల్లో క్రమశిక్షణ కట్టు దాటడానికి అవకాశం కల్పిస్తుంది. అదే జరిగితే వైసిపి ఓటు బ్యాంకు పెరగడం చాలా కష్టం. ఇది గ్రహించి మసులుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి పై ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular