https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ‘కత్తి’ లాంటి కంటెస్టెంట్ గా నబీల్..’సుత్తి’ లాంటి కంటెస్టెంట్ గా యష్మీ..వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ దెబ్బకి షాక్ అయిన కంటెస్టెంట్స్!

హౌస్ లోకి అడుగుపెట్టే ముందు కంటెస్టెంట్స్ తో నాగార్జున మాట్లాడుతూ 'ఇన్ని రోజులు బయట నుండి గేమ్ చూసారు కదా, లోపల ఉన్న వారిలో మీకు 'కత్తి' అని ఎవరు అనిపిస్తుంది, 'సుత్తి' అని ఎవరు అనిపిస్తుంది' అని అడుగుతాడు. అప్పుడు 8 మంది వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ నబీల్ 'కత్తి' అంటూ పొగిడారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 7, 2024 / 08:41 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8: నిన్న జరిగిన ‘బిగ్ బాస్ 8 ‘ రీ లోడ్ ఎపిసోడ్ ద్వారా హౌస్ లోకి 8 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ముక్కు అవినాష్, గంగవ్వ, నయనీ పావని, టేస్టీ తేజ,హరి తేజ,మహబూబ్,రోహిణి, గౌతమ్ వీళ్లంతా హౌస్ లోకి అడుగుపెట్టారు. వీళ్ళ రాకతో హౌస్ లో పాత కంటెస్టెంట్స్ అందరికీ వణుకు పుట్టింది. ఎందుకంటే వీళ్లంతా గత సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్స్. అందరికీ హౌస్ లో ఉన్నవారికంటే పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్ళను తట్టుకొని టాప్ 5 లోకి పాత కంటెస్టెంట్స్ రావడం సాధారణమైన విషయం కాదు. ఆ భయం అందరిలో ఉన్నింది. అయితే ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా పిలవబడే యష్మీ, నబీల్ ని వైల్డ్ కార్డు ఎంట్రీలు టార్గెట్ చేసినట్టుగా అనిపించింది.

    హౌస్ లోకి అడుగుపెట్టే ముందు కంటెస్టెంట్స్ తో నాగార్జున మాట్లాడుతూ ‘ఇన్ని రోజులు బయట నుండి గేమ్ చూసారు కదా, లోపల ఉన్న వారిలో మీకు ‘కత్తి’ అని ఎవరు అనిపిస్తుంది, ‘సుత్తి’ అని ఎవరు అనిపిస్తుంది’ అని అడుగుతాడు. అప్పుడు 8 మంది వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ నబీల్ ‘కత్తి’ అంటూ పొగిడారు. ఆటలు బాగా ఆడుతున్నాడు, ముందు ఒక మాట వెనుక మాట మాట్లాడడం లేదు, చాలా నిజాయితీ గల వ్యక్తి అనిపించింది అంటూ పొగిడారు. ఇక ‘సుత్తి’ క్యాటగిరీ లో మణికంఠ ని పెడతారని అందరూ ఊహించారు కానీ, ‘యష్మీ’ ని ఎంచుకున్నారు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్. ప్రతీ చిన్న దానికి యష్మీ ఓవర్ గా రియాక్ట్ అయిపోతుంది. అది అంత అవసరం లేదేమో అని వాళ్ళ అభిప్రాయం.

    షో చూసే ప్రతీ ఒక్కరికి యష్మీ విషయం లో అదే అనిపించింది. టాస్కులు బాగా ఆడగలదు, తన అభిప్రాయాలను బోల్డ్ గా చెప్పగలదు, అన్ని బాగానే ఉన్నాయి కానీ, అబద్దాలు ఎక్కువ ఆడడం, ఒక మాట మీద నిలబడకపోవడం, మణికంఠ పై నాగుపాము లాగ పగబట్టడం, ఇలాంటి నెగటివ్ యాంగిల్స్ కారణంగా యష్మీ కాస్త వెనుకబడింది. కానీ ఆమె తన అందం తో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె ఓటు వేసే ప్రతీ ఒక్కరు ఆట కంటే ఎక్కువగా అందాన్ని చూసి వేస్తున్నారు. కానీ ఆమెలో ఉన్న చిన్నపిల్ల చేష్టలు పక్కన పెట్టేస్తే కచ్చితంగా టాప్ 5 లో ఉండే సత్తా ఉన్న కంటెస్టెంట్ అని విశ్లేషకుల అభిప్రాయం. ఇక నిన్ననే నామినేషన్స్ ప్రక్రియ కూడా పూర్తి అయ్యింది. నేడు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ అత్యధిక శాతం యష్మీ కి ఓటు వేశారు. ఇది ఆడియన్స్ కి టార్గెట్ చేసినట్టుగా అనిపించొచ్చు. నామినేషన్స్ వెయ్యడానికి కూడా యష్మీ చాలా కారణాలు అయితే ఇచ్చింది, అందులో ఎలాంటి సందేహం లేదు.