Bigg Boss 8 Telugu : జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ, క్రేజ్ ని సంపాదించుకున్న ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేమ్ తో ఈయన పలు సినిమాల్లో కూడా నటించాడు. ఆ తర్వాత ఈయన ‘బిగ్ బాస్ 4’ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టి, ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ని అందించాడు. కేవలం ఎంటర్టైన్మెంట్ లో మాత్రమే కాదు, టాస్కులు కూడా బలంగా ఆడేవాడు అవినాష్. అందుకే ఆయన టాప్ 7 కంటెస్టెంట్స్ లో ఒకడిగా నిలిచాడు. అయితే అవినాష్ జీవితాన్ని బిగ్ బాస్ కి ముందు, బిగ్ బాస్ కి తర్వాత అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ముందు అవినాష్ కి చాలా అప్పులు ఉండేవి. ‘జబర్దస్త్’ ద్వారా వచ్చిన డబ్బులను తన అప్పులకే కట్టుకుంటూ ఉండేవాడు.
ఒకానొక సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా వచ్చిందట. కానీ యాంకర్ శ్రీముఖి అతన్ని ఆర్థికంగా ఆదుకొని అప్పులన్నీ కట్టేసింది. అలా సాగుతున్న అవినాష్ కి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. జీవితంలో వచ్చిన అద్భుతమైన అవకాశం, మళ్ళీ మళ్ళీ రాదు, కానీ జబర్దస్త్ ని అగ్రిమెంట్ పూర్తి అవ్వకముందే వదిలేయాలి అంటే డబ్బులు భారీ గా యాజమాన్యం కి చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆయన మళ్ళీ అప్పు చేసి, జబర్దస్త్ యాజమాన్యం కి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. అప్పట్లో అవినాష్ కి ఇప్పుడు ఉన్నంత క్రేజ్ లేదు. దీంతో బిగ్ బాస్ మామూలు రెమ్యూనరేషన్ ఇచ్చాడు. 10 వారాలు హౌస్ లో ఉన్నందుకు గాను ఆయనకు బిగ్ బాస్ యాజమాన్యం 15 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఇచ్చారట. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత అవినాష్ రేంజ్ ఎలా మారిపోయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతకు ముందు బుల్లితెర మీద మంచి ఎంటెర్టైనెర్స్ ఎవరు అంటే సుడిగాలి సుధీర్ , గెటప్ శ్రీను, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర మాత్రమే.
వీళ్ళందరూ సినిమాల్లో బిజీ అవ్వడం తో ఇక అవినాష్ బుల్లితెర ఎంటర్టైన్మెంట్ షోస్ కి కింగ్ గా మారిపోయాడు. స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ప్రతీ ఎంటర్టైన్మెంట్ షో లో అవినాష్ కచ్చితంగా ఉండాల్సిందే. ఈటీవీ కి అప్పట్లో సుడిగాలి సుధీర్ ఎలా బ్రాండ్ గా తయారయ్యాడో, స్టార్ మా ఛానల్ కి అవినాష్ అలాంటి బ్రాండ్ గా మారిపోయాడు. అలా చేతినిండా ఈవెంట్స్ తో దూసుకెళ్తున్న అవినాష్ ని బిగ్ బాస్ టీం సంప్రదించింది. ఆయనకు వారానికి 5 లక్షల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేసింది. ఇక ఏమాత్రం ఆలోచించకుండా అవినాష్ ఈ సీజన్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. టాప్ 5 లోకి వెళ్లగల సత్తా ఉన్న అవినాష్ తన ఆట తీరుతో వెళ్తాడా లేదా అనేది చూడాలి.
The Bigg Boss house is about to get more exciting with the wild card entry of Mukku Avinash! How will his arrival shake up the game?#BiggBossTelugu8 #MukkuAvinash #StarMaa @iamnagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/D3t8RTiPSO
— Starmaa (@StarMaa) October 6, 2024