Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8′ కోసం రోహిణి ఎన్ని సినిమాలను వదులుకుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

అలా బిజీ ఆర్టిస్టు గా కొనసాగుతున్న రోహిణి ని బిగ్ బాస్ టీం ఇటీవలే వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా రావాలని రిక్వెస్ట్ చేసారు. దీనికి ఆమె వెంటనే ఒప్పుకుంది. కానీ రెమ్యూనరేషన్ మాత్రం భారీగానే డిమాండ్ చేసింది,

Written By: Vicky, Updated On : October 7, 2024 8:44 am

actress-rowdy-rohini

Follow us on

Bigg Boss 8 Telugu : అప్పట్లో ‘జీ’ తెలుగులో ప్రసారమయ్యే ‘కొంచెం ఇష్టం..కొంచెం కష్టం’ టీవీ సీరియల్ లో నెల్లూరు యాసతో అద్భుతమైన కామెడీ ని పండించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రోహిణి. ఈ సీరియల్ ద్వారా ఆమెకు వచ్చిన క్రేజ్ తో పలు టీవీ సీరియల్స్ లో అవకాశాలు సంపాదించింది. అలా చిన్నగా పాపులారిటీ తెచ్చుకున్న రోహిణి బిగ్ బాస్ సీజన్ 3 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టింది. హౌస్ లో ఉన్నప్పుడు ఈమె ఎంటర్టైన్మెంట్ పంచడం లో కానీ, టాస్కులు ఆడడంలో కానీ తన తోటి కంటెస్టెంట్స్ తో ఒక రేంజ్ లో పోటీ పడేది. అయితే హౌస్ లో ఎక్కువగా వెనక చేరి మాట్లాడుతుండడం, గుసగుసలు ఎక్కువ అవ్వడంతో కాస్త నెగటివిటీ ని సంపాదించింది రోహిణి. ఫలితంగా ఆమె 7 వారాల్లోనే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.

హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత రోహిణి కెరీర్ వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది. అలా దూసుకెళ్తున్న సమయంలో ఆమె యాక్సిడెంట్ అవ్వడంతో కాళ్ళు విరిగాయి. చాలా రోజుల పాటు ఆమె ట్రీట్మెంట్ తీసుకుంది. కొంత కాలం వీల్ చైర్ కి పరిమితమైన ఆమె, ఆ తారట కర్ర సహాయంతో నడిచేది. అలా ఏడాది పాటు ఆమె సీరియల్స్ కి, ఎంటర్టైన్మెంట్ షోస్ కి, సినిమాలకి దూరం అయ్యింది. ఆ తర్వాత కోలుకొని రీ ఎంట్రీ ఇచ్చిన రోహిణి కి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా ఆఫర్లు ఆమెకోసం క్యూలు కట్టాయి. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో రోహిణి కి మంచి కామెడీ పాత్రలు దక్కాయి. ఈ ఏడాది కూడా ఆమె ‘డబుల్ ఇస్మార్ట్’, ‘మత్తు వదలరా 2’ వంటి చిత్రాల్లో కనిపించింది. ఇక బుల్లితెర మీద ఈమె ఇప్పటికీ అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ లో కనిపిస్తూనే ఉంటుంది. జబర్దస్త్ తో ఆటో రామ్ ప్రసాద్ టీం లో కొనసాగుతూనే, స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోలో కూడా కనిపించేది.

అలా బిజీ ఆర్టిస్టు గా కొనసాగుతున్న రోహిణి ని బిగ్ బాస్ టీం ఇటీవలే వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా రావాలని రిక్వెస్ట్ చేసారు. దీనికి ఆమె వెంటనే ఒప్పుకుంది. కానీ రెమ్యూనరేషన్ మాత్రం భారీగానే డిమాండ్ చేసింది, అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈమెకు బిగ్ బాస్ టీం వారానికి 4 లక్షల రూపాయిలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈమె ఎంటర్టైన్మెంట్ విషయం లో అసలు ఢోకా లేదు, ఈమెకు ఉన్నటువంటి టైమింగ్ హౌస్ లో అవినాష్ కి కూడా ఉండదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టాస్కులు కూడా అద్భుతంగా ఆడగలదు అని మొదటి టాస్కుతోనే నిరూపించుకుంది. మరి రాబోయే రోజుల్లో ఈమె టాస్కులు ఎలా ఆడుతుంది?, ఎంటర్టైన్మెంట్ ఎలా పంచుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.