https://oktelugu.com/

NTR: ఎన్టీయార్ లేకపోతే కళ్యాణ్ రామ్ పరిస్థితి వేరేలా ఉండేదా..? అన్న ను సరైన సమయం లో ఆదుకున్న తారక్…

ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు మంచి ఫామ్ లో ఉన్నారు. వరుస సినిమాలను చేసుకుంటూ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు... ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు.

Written By:
  • Gopi
  • , Updated On : October 6, 2024 / 10:45 AM IST

    NTR(8)

    Follow us on

    NTR: నందమూరి నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్న ఎన్టీఆర్ రీసెంట్ గా ‘దేవర’ సినిమాతో మరోసారి సక్సెస్ ని సాధించి భారీ కలెక్షన్లను కొల్లగొడుతున్నాడు. ఇక ఏది ఏమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇక దేవర సినిమా సక్సెస్ తో ఆయన వరుసగా ఏడోవ సక్సెస్ ను కూడా అందుకున్నాడు. ఇక ఇలా ఉంటే ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య అయిన కళ్యాణ్ రామ్ హీరోగా సినిమాలు చేసే దానికంటే ప్రొడ్యూసర్ గా ఎక్కువ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. నిజానికి మొదట్లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ని స్థాపించిన సమయంలో కళ్యాణ్ రామ్ కి ఒకటి, రెండు హిట్స్ మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ సినిమాలు రావడంతో ఒక్కసారిగా ఆయనకు విపరీతమైన అప్పులు కూడా పెరిగిపోయాయి.

    ఇక సరిగ్గా అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తన అన్నతో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ని పడిపోకుండా ఉండేలా చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అందులో భాగంగానే ఎన్టీఆర్ బాబీ తో చేసిన ‘జై లవకుశ’ సినిమాకి కళ్యాణ్ రామ్ ని ప్రొడ్యూసర్ గా తీసుకొని మరి ఆ సినిమాను చేశాడు. ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో కళ్యాణ్ రామ్ కి భారీ లాభాలు వచ్చాయి.

    ఇక అలా ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ ని జూనియర్ ఎన్టీఆర్ చాలా వరకు కృషి చేస్తూ వస్తున్నాడు. ఒకవేళ ఎన్టీఆర్ కనక లేకపోతే నందమూరి కళ్యాణ్ రామ్ విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయేవాడని సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు.

    అయితే నందమూరి ఫ్యామిలీ పరువు ప్రతిష్టను నిలబెట్టడంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముందు వరుసలో ఉంటున్నారు. ఇక వీళ్ళు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దీన్ని చూసిన నందమూరి అభిమానులు అందరూ చాలా సంతోషపడుతున్నారనే చెప్పాలి…ఈ ఇద్దరి అన్నదమ్ముల అనుబంధం అనేది చూడ చక్కగా ఉందని సినీ సెలబ్రిటీలు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…