https://oktelugu.com/

Chiranjeevi: చిరంజీవి క్యాస్ట్ ఏంటో తెలుసుకున్నాకే సురేఖతో పెళ్లి ఫిక్స్ చేశారా..? ఓపెన్ గా చెప్పిన స్టార్ ప్రొడ్యూసర్…

మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చేసిన సినిమాలే ఆయనను చాలా గొప్పగా పరిచయం చేస్తూ ఉంటాయి. అలాంటి గొప్ప వ్యక్తి ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ఉండడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : October 6, 2024 / 10:51 AM IST

    Chiranjeevi(16)

    Follow us on

    Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో దాదాపు 40 సంవత్సరాలుగా మెగాస్టార్ గా కొనసాగుతున్న ఏకైక హీరో చిరంజీవి… అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా తన ఇమేజ్ ను కూడా రెట్టింపు చేసుకుంటూ వస్తున్నాడు. ఇక మాస్ సినిమాలను చేయడంలో ఆయనను మించిన హీరో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటికి కూడా ఆయన ప్లేస్ ని ఆక్యుపై చేసే హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేరని చెప్పడంలో కూడా ఎంత మాత్రం అతిశయోక్తి అయితే లేదు. ఇక ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న చిరంజీవి తనను మించిన హీరో మరొకరు లేరు అనెంతలా గొప్ప గుర్తింపునైతే సంపాదించుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి, అల్లు రామలింగయ్య కూతురు అయిన సురేఖను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక రీసెంట్ గా అల్లు అరవింద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు చిరంజీవి ని తన చెల్లి అయిన సురేఖకు ఇచ్చి పెళ్లి చేయడంలో వాళ్ళ అమ్మ కీలక పాత్ర వహించిందని చెప్పాడు.

    సత్యనారాయణ రాజు అనే వ్యక్తి అల్లు రామలింగయ్య ఇంటిపైన ఉండేవాడట. చిరంజీవి ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు పొరపాటున అల్లు రామలింగయ్య గారి ఇంటి డోర్ కొట్టడంతో అల్లు రామలింగయ్య భార్య చిరంజీవిని చూసి ఇతను సినిమాల్లో చేసే చిరంజీవి కదా అని అనుకుందట…అలాగే సత్యనారాయణ రాజు పైనుంటాడని చెప్పడంతో చిరంజీవి పైకి వెళ్లి సత్యనారాయణ రాజును కలిసి వెళ్లిపోయిన తర్వాత నారాయణ రాజు తో అల్లు రామలింగయ్య భార్య చిరంజీవి క్యాస్ట్ ఏంటో తెలుసుకొని మరి అతనికి సురేఖను ఇవ్వాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిందట.

    ఇక ఈ విషయం అల్లు రామలింగయ్య కి కూడా తెలిసి చిరంజీవికి తన కూతుర్ని ఇవ్వడానికి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయి వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారట. మొత్తానికైతే సురేఖను చిరంజీవికి ఇవ్వడానికి క్యాస్ట్ కూడా చూసి ఇచ్చారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి మెగాస్టార్ గా ఇండస్ట్రీని శాసిస్తూ తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

    చిరంజీవి ద్వారానే అల్లు ఫ్యామిలీ కూడా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఆ తర్వాత స్టార్ హీరోగా మారడానికి చిరంజీవి చాలా వరకు హెల్ప్ చేశారనే విషయం మనందరికీ తెలిసిందే…