ఒకేసారి నాలుగు ప్రాజెక్టులతో హీరో నిఖిల్​ బిజీ!

చిన్న చిన్న పాత్రలతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమై.. ప్రస్తుతం టాప్​ యంగ్​ హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందారు నిఖిల్​. తన సినిమాలకంటూ టాలీవుడ్​ ప్రేక్షకుల్లో స్పేషల్​ మార్క్​ను క్రియేట్​ చేసుకుని విభిన్న కథాంశాలతో దూసుకెళ్లిపోతున్నారు. స్వామి రారా తర్వాత నుంచి నిఖిల్​ సినిమా రిలీజ్​ అవుతుందంటే చాలు అందులో ఏదో కొత్తదనం ఉంటుందనే భరోసాను కల్పిస్తూ వస్తున్నారు. ఆ అంచనాలను ఎక్కడా తగ్గకుండా ప్రతి సారీ సరికొత్త కథతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా, మరో అప్​డేట్​ […]

Written By: Raghava Rao Gara, Updated On : October 26, 2021 1:03 pm
Follow us on

చిన్న చిన్న పాత్రలతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమై.. ప్రస్తుతం టాప్​ యంగ్​ హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందారు నిఖిల్​. తన సినిమాలకంటూ టాలీవుడ్​ ప్రేక్షకుల్లో స్పేషల్​ మార్క్​ను క్రియేట్​ చేసుకుని విభిన్న కథాంశాలతో దూసుకెళ్లిపోతున్నారు. స్వామి రారా తర్వాత నుంచి నిఖిల్​ సినిమా రిలీజ్​ అవుతుందంటే చాలు అందులో ఏదో కొత్తదనం ఉంటుందనే భరోసాను కల్పిస్తూ వస్తున్నారు. ఆ అంచనాలను ఎక్కడా తగ్గకుండా ప్రతి సారీ సరికొత్త కథతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా, మరో అప్​డేట్​ ఇస్తూ.. అభిమానుల్లో ఒక్కసారిగా జోష్​ పెంచారు నిఖిల్​. తన కెరీర్​లో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి నాలుగు చిత్రాలకు పని చేస్తున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్​ వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు నిఖిల్​.

తన కెరీర్​లో ఎప్పుడూ చూడని అనుభవంగా వర్ణించారు. ఒకేసారి నాలుగు సినిమాలకు వర్క్ చేయడంతో తన నలుగురు పిల్లల్లో ఎవర్ని మొదటగా ఎంచుకోవాలో అన్నట్టుగా ఉందని చెప్పుకొచ్చారు. అన్ని సినిమాలకు తన బెస్ట్ ఫర్మార్మెన్స్​ అందిస్తున్నట్లు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే నిఖిల్​కు సినిమాలపై ఉన్న డెడికేషన్​ ఎంటో అర్థం చేసుకోవచ్చు.

స్వామిరారా సినిమాతో సూపర్​ హిట్​ కొట్టిన నిఖిల్​.. ఆ తర్వాత వచ్చిన కార్తికేయ చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు నిఖిల్. చేసే ప్రతి సినిమాలో విభిన్న కథను ఎంచుకుంటూ.. ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. చివరగా నిఖిల్​ నుంచి వచ్చిన సినిమా అర్జున్​ సురవరం. ఇందులో జర్నలిస్టుగా అదరగొట్టారు. మరి వచ్చే నాలుగు చిత్రాల్లో నిఖిల్​ ఎలా కనిపించనున్నాడో చూడాలి.