Sankranti Akayaam : సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు విక్టరీ వెంకటేష్ ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. ఇక ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో మరోసారి సంక్రాంతి పండుగకి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న ఈ ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ ని సాధించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న వెంకటేష్…మరోసారి కామెడీ ఎంటర్టైనర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి ఫ్యామిలీ ఆడియెన్స్ ని మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు వెంకటేష్ చేసిన ప్రతి ఫ్యామిలీ సినిమా కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రమోషన్స్ ను కూడా అనిల్ రావిపూడి తమ భుజాల మీద మోస్తున్నట్టుగా తెలుస్తోంది. రోజుకు ఒక ప్రమోషనల్ వీడియోని రిలీజ్ చేస్తూ ఈ సినిమా మీద భారీ హైప్ ని పెంచుతున్నారు.
అలాగే ఈ సంక్రాంతికి విన్నర్ గా ఈ సినిమా నిలువబోతోంది అంటూ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి వెంకటేష్ తో ప్రమోషనల్ వీడియోలను కూడా చేయిస్తూ వెంకటేష్ ను భారీగా ఇబ్బందులు అయితే పెడుతున్నాడు అంటూ ఆయన అభిమానులు చాలా వరకు అభ్యతరాలను వ్యక్తం చేస్తున్నారు.
కానీ ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ అనేది చాలా కీలకం. కాబట్టి ఏం చేసినా ఈ రెండు రోజుల వరకే చేయాలి. ఇక ఆ తర్వాత ఏమి చేయలేరు కాబట్టి ఇప్పుడే చాలా కష్టపడి మరి ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోలను చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ సైతం ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో దెబ్బతిని ఉన్నాడు.
కాబట్టి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఆయన కూడా ప్రమోషనల్ వీడియోలో భాగమవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది… ఇక బాలయ్య డాకు మహారాజుని ఎదుర్కొని వెంకటేష్ భారీ సక్సెస్ ని అందుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…