Game changer : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే రామ్ చరణ్ లాంటి నటుడు సైతం ఇప్పుడు భారీ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం… ఆయన స్టార్ హీరోగా వెలుగొందుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న శంకర్ తనదైన రీతిలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఆయన మొదటి నుంచి కూడా భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కాబట్టి స్క్రీన్ మీద పెట్టిన ప్రతి రూపాయి కనపడే విధంగా ఆయన సినిమాలను తీర్చిదిద్దుతూ ఉంటాడు. మరి దానికి తగ్గట్టుగానే ‘గేమ్ చేంజర్’ సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు అనే మరొక దర్శకుడు కథను అందించడం విశేషం…ఇక మొదటి నుంచి కార్తీక్ సుబ్బరాజు అందించిన కథ అద్భుతంగా ఉంది అంటూ శంకర్ అలాగే సినిమా యూనిట్ చెబుతూ ఉండడంతో ఈ సినిమా మీద మంచి అంచనాలైతే భారీ పెరుగుతూ వస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా అనుకోని రీతిలో నెగెటివ్ టాక్ ను తెచ్చుకొని ఏమాత్రం తన ఇంపాక్ట్ ను చూపించలేక పోతుంది. నిజానికి మంచి కథ అంటూ చాలా రోజుల నుంచి ఈ సినిమాని ఊరిస్తూ వచ్చారు.
కానీ ఎట్టకేలకు ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి…నిజానికి ఇందులో పెద్ద కథ అయితే ఏమీ లేదు. మరి కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకి ఏం కథ అందించాడు అంటూ ఆయన ఏ కథ చెప్పాడు తద్వారా దాన్ని సినిమాగా ఎలా రూపొందించారనేది కూడా తెలియాల్సి ఉంది.
మరి మొత్తానికైతే ఇప్పుడు శంకర్ తో పాటు కార్తీక్ సుబ్బరాజు పేరు కూడా డ్యామేజ్ అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఒక నాసిరకపు కథను అందించిన కార్తీక్ సుబ్బరాజు ఆయన చేయబోయే సినిమాలను మాత్రం ఎలాంటి కథలతో తెరకెక్కిస్తాడు. దీన్ని ఒక పవర్ ఫుల్ కథ అంటూ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
మరి ఇంత పవర్ ఫుల్ కథ అని చెప్పుకొచ్చిన ఈ కథలో అసలు మ్యాటర్ లేదు. మరి అలాంటి మ్యాటర్ లేని కథలను ఎంచుకొని జనానికి ఎలాంటి సినిమాలు చూపించాలనే ప్రయత్నం చేశారనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి…ఇక ఏది ఏమైనా కూడా ‘గేమ్ చేంజర్’ సినిమా లాంగ్ రన్ ఎంత కలెక్షన్స్ ని వసూలు చేస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది…