Game Changer : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఆ ఫ్యామిలీ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులకు విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది…ఇక రీసెంట్ గా రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి మెగా పవర్ స్టార్ గా తనదైన రీతిలో సత్తా చాటుకున్న నటుడు మాత్రం రామ్ చరణ్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట తనదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఏర్పడనుంది. రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయినా కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ చేసిన పాత్రలకు మంచి గుర్తింపు గుర్తింపు లభించింది. ఇక ఆయన ఇందులో డ్యూయల్ రోల్ లో నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే అప్పన్న అనే పాత్రలో రామ్ చరణ్ నత్తి వాడుగా చాలా బాగా నటించి మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు.
మరి ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమాలో రామ్ చరణ్ పోషించిన అప్పన్న పాత్ర తెలంగాణ ప్రాంతంలోని గుమ్మడి నరసయ్య అనే వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని రాసిన క్యారెక్టర్ గా తెలుస్తోంది. ఇక గుమ్మడి నరసయ్య అనే వ్యక్తి 1955 లో ఖమ్మం జిల్లాలోనే ‘టేకులగూడెం ‘ అనే గ్రామం లో జన్మించాడు. 1983 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సిపిఐ పార్టీ నుంచి ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు.
ఆయన ఇప్పటివరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి ఆయన సంపాదించిన ఆస్తులు మాత్రం ఏమీ లేవు. అలాగే సిపిఐ పార్టీ నుంచి పోటీ చేసి నాలుగు సార్లు విజయం సాధించిన ఈ వ్యక్తి సైకిల్ మీదే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. తనకు వచ్చిన జీతం పైసలు కూడా పార్టీ కోసమే ఖర్చు పెడుతూ తనకున్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ ఉంటాడు. ఇక ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన కూడా ఆటోల్లో, బస్సుల్లో, రైళ్లలో ప్రయాణం చేస్తూ అసెంబ్లీ సభలకు హాజరవుతూ ఉండేవాడు.
మరి ఏది ఏమైనా కూడా అంత నిజాయితీ కలవాడు కాబట్టే అతని పాత్రని అప్పన్న రూపంలో తెరమీద చూపించారు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. నిజానికి ‘గుమ్మడి నరసయ్య’ అనే ఒక సినిమా కూడా రాబోతుంది. మరి ఇదిలా ఉంటే ఈయనని స్ఫూర్తిగా తీసుకొని సినిమాను తీయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…