https://oktelugu.com/

Ram Charan: రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

గేమ్ చేంజర్ సినిమాతో డిసెంబర్ 21 తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా మీద ఇప్పటికే భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇప్పటికే గ్లోబల్ స్టార్ గా చాలా మంచి ఇమేజ్ ను దక్కించుకున్న రామ్ చరణ్ మరోసారి తనను మించిన నటుడు లేడు అనేంతలా తన పేరు ప్రఖ్యాతాలని విస్తరింపజేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : October 5, 2024 / 01:46 PM IST

    Ram Charan(7)

    Follow us on

    Ram Charan: మెగా పవర్ స్టార్ గా తనకున్న ఇమేజ్ ను రెట్టింపు చేసుకోవడానికి ప్రస్తుతం రామ్ చరణ్ తన డైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనను తాను స్టార్ హీరోగా కూడా ఎలివేట్ చేసుకుంటున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఇక తన రెండోవ సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేసిన రామ్ చరణ్ ఇప్పుడు చేస్తున్న సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు.

    ఇక గేమ్ చేంజర్ సినిమాతో డిసెంబర్ 21 తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా మీద ఇప్పటికే భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇప్పటికే గ్లోబల్ స్టార్ గా చాలా మంచి ఇమేజ్ ను దక్కించుకున్న రామ్ చరణ్ మరోసారి తనను మించిన నటుడు లేడు అనేంతలా తన పేరు ప్రఖ్యాతాలని విస్తరింపజేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు…

    ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ తన తదుపరి సినిమా బుచ్చిబాబుతో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా విషయంలో రామ్ చరణ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విషయాల్లో కొన్ని స్పెషల్ ట్రైనింగ్స్ ని కూడా తీసుకున్నాడు. ఇలాంటి క్రమంలోనే బుచ్చిబాబు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి దానికి అనుగుణంగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

    అయితే తొందర్లోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళనున్న నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు అందరిని కలవరపెడుతుంది. ఈ సినిమా మీద ఏకంగా 500 కోట్ల బడ్జెట్ ని కేటాయించి ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ విషయంలో రామ్ చరణ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు సాగుతున్నాడు. అయితే ఈ సినిమా 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి…