https://oktelugu.com/

Tollywood Heroes: ఆ విషయాల్లో మన స్టార్ హీరోలు చేతకాని వారేనా.. వాళ్లు రియల్ హీరోలు కాదు..

హీరోలు అంటే సినిమాల్లో ఫైట్లు చేస్తూ జనాలను కాపాడుతారు. కానీ ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు కేవలం సినిమాల్లోనే ఇవి చేస్తారు..నిజ జీవితం లో అలాంటివేమీ చేయరు...

Written By:
  • Gopi
  • , Updated On : October 5, 2024 / 01:40 PM IST

    Tollywood Actors Latest Remuneration Details

    Follow us on

    Tollywood Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా సంవత్సరాల నుంచి మంచి క్రేజ్ అయితే ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క హీరో మంచి సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా అధికార పార్టీ మంత్రి అయిన కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలైతే చేసింది. మరి ఆమె చేసిన వాక్యాల్ని ఖండిస్తూ సినీ సెలబ్రిటీలు అక్కినేని ఫ్యామిలీకి మద్దతు తెలుపారు. దాంతో సురేఖ దిగివచ్చి సారీ అయితే చెప్పింది. అయినప్పటికీ అక్కినేని నాగార్జున మాత్రం ఈ విషయాన్ని అంతా లైట్ గా తీసుకోకుండా సీరియస్ గా తీసుకొని ఆమె మీద కేసు ఫైల్ చేశాడు. మొత్తానికైతే కొండా సురేఖ మాట్లాడిన మాటల్లో చాలా వరకు తప్పుంది అంటూ సినిమా ఇండస్ట్రీలోని హీరోలందరూ రెస్పాండ్ అవ్వడం అనేది చాలా మంచి విషయం అనే చెప్పాలి. ఇక ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు ఐకమత్యంగా ఉంటే అందరికీ మంచిది అంటూ కొంతమంది సినీ పెద్దలు లెక్చర్లు ఇస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ని పోసాని కృష్ణ మురళి గాని, ఇతర వ్యక్తులు గాని దూషించినప్పుడు ఆయన ఫ్యామిలీని విపరీతంగా ఇబ్బంది పెట్టినప్పుడు ఏ ఒక్క హీరో ఎందుకు మాట్లాడలేదు. అంటే నాగార్జున కే ఫ్యామిలీ ఉంది, పరువు ఉంది. కానీ పవన్ కళ్యాణ్ కి ఫ్యామిలీ లేదు, పరువు లేదా..? ఎందుకు హీరోలు ఇలాంటి వైఖరిని అనుసరిస్తున్నారు.

    పవన్ కళ్యాణ్ ఒక్కరిని ఇండస్ట్రీ నుంచి దూరం చేశారా లేదంటే ఆయన ఒక్కడేనే సెపరేట్ చేసి తొక్కేయాలని చూసారా? ఇండస్ట్రీలో టికెట్ల రేటు తగ్గించింప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒక్కడే జగన్ ను ఎదురించి మాట్లాడాడు. అప్పుడు ఎవ్వరూ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా మాట్లాడలేదు. ఇక నాగార్జున టిక్కెట్ రేట్ తగ్గింపు మీద ఎలాంటి మాటలు మాట్లాడలేదు.

    పైగా స్టేజ్ మీదనే తనకు టికెట్ రేట్ తగ్గడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పాడు. మరి అప్పుడు మాట్లాడని వాళ్ళు ఇప్పుడు ఎందుకు హడావిడి చేస్తున్నారు. ఇక హీరోల్లో కూడా ఐకమత్యం ఉంది అనుకోవడం మన మూర్ఖత్వం… పవన్ కళ్యాణ్ ను మినహా ఇస్తే అసలైన విషయాల్లో మాట్లాడడం చేతకాని దద్దమ్మలు మన స్టార్ హీరోలు..సినిమాల్లో ఫైట్లు చేయడం, పోరాటాలు చేయడం తప్ప నిజ జీవితం లో జోకర్లు కంటే అద్వానం మన హీరోలు…

    ఇప్పుడు కొండా సురేఖ ఏదో అన్నారని ఆవిడ సారీ చెప్పినా కూడా ఆవిడ మీద ఫైర్ అవుతూ మాట్లాడుతున్నారు..మరి ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదా? మరి అప్పుడెందుకు రియాక్టు అవ్వలేదు. ఇండస్ట్రీ అంత సమిష్టిగా ఉంది అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడినప్పుడు లేవని నోర్లు నాగార్జున గురించి మాట్లాడే సరికి ఎందుకు లేస్తున్నాయి అనేది తెలిస్తేనే దీనికి సమాధానం దొరుకుతుంది…