Anirudh Ravichander: దేవర సక్సెస్ అయింది…మరి ఇప్పుడైనా అనిరుధ్ కి తెలుగు లో అవకాశాలు వస్తాయా..?

తెలుగులో చాలా మంది నటులు తమకంటూ ఒక ప్రత్యేకత ఏర్పాటు చేసుకున్నారు. జూనియర్ ఎన్టీయార్ లాంటి నటుడు వారసత్వం గా ఇండస్ట్రీ కి వచ్చినప్పటికి తను చాలా వరకు కష్టపడి స్టార్ హీరోగా ఎదిగాడు...

Written By: Gopi, Updated On : October 5, 2024 1:54 pm

Anirudh Ravichander

Follow us on

Anirudh Ravichander: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుంది. మొదటి రెండు రోజులు ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత నెమ్మదిగా సినిమా కలెక్షన్స్ పెరగడమే కాకుండా ప్రేక్షకులందరిలో పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. మరి మొత్తానికైతే ఈ సినిమా తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తూ ఇప్పుడు పెను ప్రభంజనాన్ని సృష్టించడం అనేది ఒక రకంగా మంచి విషయమనే చెప్పాలి. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా వరుసగా 7 వ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని ఏ హీరోకి దక్కని ఒక అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో 500 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక పాన్ ఇండియాలో జూనియర్ ఎన్టీఆర్ కు ఇదే హైయెస్ట్ రికార్డ్ కావడం విశేషం…సోలోగా ఆయన అన్ ఇండియా లో చేసిన సినిమా కూడా ఇదే కావడం వల్ల ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ భారీ రేంజ్ లో ఉన్నాయి.

మరి దానికి అనుకూలంగానే ఈ సినిమా సక్సెస్ ని సాధించి ముందుకు దూసుకెళ్తుండడం కూడా ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఇక ఇదిలా ఉంటే సినిమా సాంగ్స్ విషయంలో పెద్దగా మ్యూజిక్ ని అందించని అనిరుధ్ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో మాత్రం ఒక పెను సంచలనాన్ని సృష్టించాడనే చెప్పాలి. ముఖ్యంగా కొన్ని ఎలివేషన్స్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది.

దాని వల్లే జూనియర్ ఎన్టీఆర్ చేసిన యాక్షన్ గాని, చెప్పిన డైలాగ్ కానీ చాలా వరకు ఎలివేట్ అయ్యాయి. ఇక ఈ దెబ్బతో అనిరుధ్ తెలుగులో మంచి సక్సెస్ అయితే అందుకున్నాడు. మరి మిగతా స్టార్ హీరోలు కూడా అనిరుధ్ తో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అతన్ని తమ సినిమాల్లోకి తీసుకొని తద్వారా వాళ్లు కూడా భారీ మ్యూజికల్ హిట్స్ ని సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారా అనే విషయాల మీద సరైన క్లారిటీ రావడం లేదు.

కానీ ఇక రాబోయే సినిమా విషయాల్లో అనిరుధ్ చాలా కీలకపాత్ర వహించబోతున్నాడు అనేది మాత్రం చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇక ఇప్పటికైనా అనిరుధ్ టాలెంట్ ని గుర్తించిన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆయనకు వరుసగా సినిమా అవకాశాలు ఇస్తే మరిన్ని అద్భుతాలు చేయడానికి తను రెడీగా ఉన్నానని ఒకానొక సందర్భంలో తెలియజేశాడు…