Sai Pallavi
Sai Pallavi : సినిమా ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఎక్కువగా ఉంటుందంటూ చాలామంది హీరోయిన్స్ చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం హీరోలను సైతం పక్కన పెట్టేసి వాళ్ళ క్రేజ్ ను పెంచుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక అలాంటి వారిలో సాయి పల్లవి (Sai Pallavi) మొదటి వరుసలో ఉంటుంది…ఆమెతో సినిమా చేయాలి అంటే ఆమె పెట్టే కండిషన్స్ కి ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నప్పుడే ఆ సినిమాకి కమిట్ అవుతుంది. తన పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత కూడా ఉండాలి. పాటల వరకే పరిమితం అవుతాము అంటే మాత్రం అలాంటి పాత్రలను ఆమె అస్సలు చేయదు…రీసెంట్ గా నాగచైతన్య(Naga Chaithanya) తో ‘తండేల్’ (Thandel) అనే సినిమా చేసింది. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతోంది. మరి ఏది ఏమైనా కూడా ఆమె కంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంది.
కాబట్టి ఆమెకు అంత డిమాండ్ అయితే ఉంది. ఏ హీరో అయినా సరే తన పక్కన సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తే బాగుంటుందని కోరుకునే రేంజ్ కి తన స్టార్ డమ్ ను విస్తరింప చేసుకుంది. ముఖ్యంగా ఆమె ఎక్స్పోజింగ్ చేయదు, బికినీలు వేసుకోదు. ఓన్లీ ఫ్యామిలీ క్యారెక్టర్లు మాత్రమే తను చేస్తూ ముందుకు సాగుతుంది.
ఇక గత సంవత్సరం ‘ అమరన్ ‘ సినిమాతో మంచి విజయాన్ని సంపాదించుకున్న ఆమె ఇప్పుడు మాత్రం తండేల్ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక మీదట రాబోయే సినిమాలతో కూడా వరుస బ్లాక్ బస్టర్ లను సాధిస్తానని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతుంది. ఇక ప్రస్తుతం తండేల్ సినిమా కోసం ఆమె 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి వచ్చే సినిమాతో 12 కోట్ల కి తన రెమ్యూనరేషన్ ని పెంచినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
మరి ఈ రేంజ్ లో హీరోయిన్ రెమ్యూనరేషన్ తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా ఆ రేంజ్ లో అయితే ఛార్జ్ చేయడం లేదు. సాయి పల్లవికి చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. దాని వల్లే ఆమె ఏ పాత్ర చేసిన కూడా వాళ్ళందరూ ఆదరిస్తూ ఉంటారు. కారణం ఏదైనా కూడా తను మాత్రం డీసెంట్ పాత్రలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ రోజురోజుకి అభిమానులను సంపాదించుకుంటూ ఉంటుంది…