Brahmanandam
Brahmanandam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళు చేస్తున్న సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొంతమంది హీరోలు చేయాల్సిన సినిమాలను మరి కొంతమంది చేసి స్టార్ హీరోలుగా కూడా మారిపోతున్నారు. అందుకే ఒక సినిమాని జడ్జ్ చేయగలిగే కెపాసిటీ హీరోలకు ఉండాలి. అది లేకపోతే మాత్రం మంచి సినిమాలను వదిలేసి ప్లాప్ సినిమాలను చేయాల్సిన పరిస్థితి అయితే రావచ్చు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ బ్రహ్మగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు బ్రహ్మానందం(Bramhanandam)… ఒకప్పుడు బ్రహ్మానందం అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపు అయితే ఉండేది. గత కొన్ని సంవత్సరాలు నుంచి ఆయన అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు తప్ప కంటిన్యూస్ గా సినిమాని చేయడం లేదు. ఏజ్ రీత్యా ఆయనకు భారీగా ఏజ్ పెరిగిపోవడం ఆరోగ్య సమస్యలు కూడా రావడం వల్ల ఆయన సెలెక్టెడ్ గా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఏది ఏమైనా కూడా కామెడీ కి రారాజుగా పిలువబడే బ్రహ్మానందం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా పేరు సంపాదించుకోవడమే కాకుండా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ లో కూడా తన పేరు నమోదు చేసుకున్నాడు… ఆయన కొడుకు అయిన రాజా గౌతమ్ (Raja Goutham) ను కే రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ‘పల్లకిలో పెళ్లికూతురు’ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసినప్పటికి ఆ సినిమా ఆవరేజ్ గా ఆడింది. ఇక ఆ తర్వాత చేసిన రెండు మూడు సినిమాలు పెద్దగా సక్సెస్ లను సాధించకపోవడంతో ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు.
ఇక రీసెంట్ గా వీళ్ళిద్దరూ కలిసి చేసిన ‘బ్రహ్మా ఆనందం’ (Bramha Anandam) సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతుంది. మరి ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో బ్రహ్మానందం కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఆ గుర్తింపుతోనే శేఖర్ కమ్ముల (Shekar Kammula) లాంటి డైరెక్టర్ సైతం బ్రహ్మానందం కొడుకుతో ఒక సినిమా చేయడానికి ముందుకు వచ్చారట.
కానీ రాజ గౌతమ్ మాత్రం ఆ సినిమాని రిజెక్ట్ చేశారట. ఇంతకీ శేఖర్ కమ్ముల చేద్దామనుకున్న సినిమా ఏంటి అంటే ‘గోదావరి’ (Godhavari)…ఇక తను రిజెక్ట్ చేయడంతో ఆ సినిమాని సుమంత్ తో చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. నిజానికి ఈ సినిమా ఆయన కనక చేసి ఉంటే ఆయన కెరీర్ అనేది వేరే లెవెల్లో ఉండేదని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను చెబుతూ ఉంటారు.
గోదావరి సినిమా ఒక క్లాసికల్ గా నిలిచిపోయిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టీవీలో గాని ఓటిటి లో గాని ఈ సినిమాకి చాలా మంచి గుర్తింపైతే ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…