Daaku Maharaaj
Daaku Maharaaj : సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలందరిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ముఖ్యంగా బాలయ్య బాబు లాంటి నటుడైతే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా భారీ విజయాన్ని అందుకొని ఎప్పటికప్పుడు స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు…’నందమూరి తారక రామారావు’ గారి పేరు నిలబెడుతున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు (Balayya Babu) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నందమూరి ఫ్యామిలీ నటసింహంగా గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ ప్రేక్షకుల్లో ఆనందాన్ని నింపుతుంది. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకోవడమే కాకుండా ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించి పెడుతున్నాయి. ఇక రీసెంట్ టైమ్ లో ఆయన చేసిన నాలుగు సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక గుర్తింపు కూడా సంపాదించి పెట్టాయి. ఇక ఇప్పుడు బోయపాటి శ్రీను (Boyapati srinu) తో చేస్తున్న అఖండ 2(Akhanda 2) సినిమా భారీ విజయాన్ని సాధించడానికి రెడీగా ఉంది. మరి ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు సినిమాలను చేస్తూ యంగ్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ సూపర్ సక్సెస్ లను అందుకోవడం అనేది మామూలు విషయం కాదు…ఇక రీసెంట్ గా ఆయన బాబీ డైరెక్షన్ లో చేసిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj) సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక థియేటర్లో సందడి చేసిన ఈ సినిమా ఓటిటి లో కూడా సందడి చేయడానికి రెడీ అవుతుంది. ఈనెల 21వ తేదీన ‘నెట్ ఫ్లిక్స్’ లో ఈ సినిమా స్ట్రిమింగ్ అవుతుంది అంటు నెట్ ఫ్లిక్స్ సంస్థ అనౌన్స్ చేసింది.
మరి మొత్తానికైతే ఈ సినిమాతో బాలయ్య థియేటర్లో సందడి చేయడమే కాకుండా ఓటిటి లో కూడా తన మార్కు చూపిస్తాడంటూ బాలయ్య అభిమానులు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా బాలయ్య లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే చాలా మంచి సినిమాలను చేస్తూ వస్తున్నాడు…
ఇక ఒకప్పుడు ప్రయోగాత్మకమైన సినిమాలను చేయడంలో బాలయ్య బాబు ముందుండేవాడు. భైరవద్వీపం, ఆదిత్య 369 లాంటి ఎన్నో ఎక్స్పరమెంటల్ సినిమాలను కూడా చేశాడు. అయితే ఇప్పుడు కూడా అలాంటి సినిమాలు చేయాలని చూస్తున్నప్పటికి దర్శకులు మాత్రం అతని దగ్గరికి అలాంటి మంచి కథలను తీసుకురావడం లేదని బాలయ్య ఓపెన్ గా చెబుతున్నాడు.
ఇక అలాంటి కథతో ఎవరొచ్చినా సరే మరోసారి తను ప్రయోగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెబుతున్నాడు. కానీ కమర్షియల్ సినిమాలు మాత్రమే అతని దగ్గరికి వస్తున్నాయి. దానివల్ల ఆ సినిమాలనే చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడున్న సీనియర్ హీరోలందరిలో బాలయ్య టాప్ లెవెల్లో ఉన్నాడనే చెప్పాలి…